Noodles Row In High-Speed Trains: చైనాలోని హైస్పీడ్ రైళ్లలో నూడుల్స్ తినడం గురించి మరోసారి వివాదం తలెత్తింది. హైస్పీడ్ రైలులో ఇన్ స్టంట నూడుల్స్ తినేందుకు అనుమతింబడదనే రైల్వే అధికారులు హెచ్చరికలపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హెచ్చరికను ఓ ప్యాసింజర్ తీవ్రంగా ఖండిస్తూ ఓ పోస్టు పెట్టారు. ప్రయాణీకులు నూడుల్స్ తినాలనుకుంటే, డైనింగ్ క్యారేజీకి వెళ్లి తినాలని చెప్పడం నిజంగా దారుణం అన్నారు. నిజంగా ఇదో అనాగరిక ప్రవర్తను గుర్తు చేస్తుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్టుపై చైనాలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఆన్ బోర్డ్ ఆహారం గురించి కీలక మార్గదర్శకాలు
చైనా రైల్వే సంస్థ ఆన్ బోర్టులో ఆహారం తీసుకోవడం గురించి కీలక మార్గదర్శకాలను రూపొందించింది. “ప్రయాణీకులు తమ ప్రయాణంలో ఇన్ స్టంట్ నూడుల్స్ లాంటి ఎక్కువ వాసన కలిగిన ఆహారాన్ని తినకూడదు” అనే నిబంధన కూడా ఉంది. “హీటింగ్ ప్యాక్‌లు లేని ఇన్ స్టంట్ నూడుల్స్ అనుమతించబడతాయి. కానీ, ప్రయాణీకులు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్ స్మెల్ వచ్చే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది” అని రైల్వే అధికారులు తెలిపారు. హై-స్పీడ్ రైళ్లలో ఇన్ స్టంట్ నూడుల్స్ సాధారణంగా అమ్మరని గుర్తు చేశారు. ప్రయాణీకుల ఆహారం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తే, సమస్యను పరిష్కరించడంలో సహాయపడేలా సిబ్బందికి తగిన గైడ్ లైన్స్ ఇస్తామని వెల్లడించారు.
కొంత మంది పాజిటివ్ గా.. మరికొంత మంది నెగెటివ్ గా..
హైస్పీడ్ రైళ్లలో ఇన్ స్టంట్ నూడుల్స్ మీద ఆంక్షలు పెట్టడాన్ని కొంత మంది నెటిజన్లు సమర్థించగా, మరికొంత మంది వ్యతిరేకించారు. “ఇన్‌స్టంట్ నూడుల్స్ వాసన నిజంగా ఘాటుగా ఉంటుంది. దీనికి బదులుగా కోల్డ్ నూడుల్స్, బ్రెడ్ లేదంటే బిస్కెట్ లను తెచ్చుకుంటే బాగుటుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొంత మంది మాత్రం ఈ ఫుడ్ ను అనుమతించకపోవడం దారుణం అన్నారు. “ఇన్ స్టంట్ నూడుల్స్ తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని రెడీ చేసుకోవడం చాలా సులభం. అందుకే, వీటిని తినేలా అనుమతించాల్సిన అవసరం ఉంది” అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Read Also: రైల్లో సీట్ల గొడవ, చివరకు భాష లొల్లిగా మారి.. నెట్టింట వీడియో వైరల్!
గతంలోనూ నూడుల్స్ వివాదం
ఇన్ స్టంట్ నూడుల్స్ గొడవ చైనాలో ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఓసారి పెద్ద రచ్చకు కారణం అయ్యింది. హై-స్పీడ్ రైలులో ఓ వ్యక్తి ఇన్ స్టంట్ నూడుల్స్ తినడాన్ని ఓ మహిళ వ్యతిరేకించింది. తన బిడ్డకు ఇన్ స్టంట్ నూడుల్స్ అలెర్జీ ఉందని వివరించింది. అతడు వాటి వాసన చూస్తే ఎలర్జీకి గురవుతాడని చెప్పింది. ఈ విషయాన్ని తనకు చెప్పనా పట్టించుకోకపోవడంతో అధికారులకు కంప్లైంట్ చేసింది. అప్పట్లో ఈ ఘటన పెద్ద చర్యకు కారణం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ వివాదం చెలరేగింది.
Read Also: ఆ రాష్ట్రంలో 99 శాతం మంది మాంసాహారులే.. నాన్ వెజ్ మరీ అంతలా తినేస్తారా?