Jaipur Robbery: కచోరి తినేందుకు ద్విచక్ర వాహనం ఆపిన వ్యాపారికి ఊహించని షాక్ తగిలింది. రూ.20 పెట్టి కచోరీ తింటుండగా.. ఆయన నుంచి రూ.20 లక్షల నగదు ఉన్న సంచిని ఇద్దరు వ్యక్తులు దోచేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
జైపూర్‌లోని నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ విచిత్ర దొంగతనం చోటుచేసుకుంది. బాధిత వ్యాపారి చంపాలాల్ తన వద్ద రూ. 20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను స్కూటర్ ముందు భాగంలో ఉంచారు. ఆపై దాన్ని గమనిస్తూనే పక్కనే నిలబడి ప్రశాంతంగా కచోరీ తింటున్నారు. అదే సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. క్షణాల్లో ఆ బ్యాగ్‌ను లాక్కుని వేగంగా అక్కడి నుంచి పారిపోయారు.
ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోలో చంపాలాల్ ప్రశాంతంగా నిలబడి కచోరీ ఆస్వాదిస్తూ కనిపిస్తారు. ఆయన పక్కనే ఒక స్కూటర్ వచ్చి ఆగడం.. వెనుక కూర్చున్న వ్యక్తి స్కూటర్‌పై ఉన్న క్యాష్ బ్యాగ్‌ను లాక్కోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. బ్యాగ్ పోయిందని గ్రహించిన చంపాలాల్ చేతిలో ఉన్న కచోరీని అలాగే పట్టుకుని దొంగల వెంట పరుగెత్తారు. ఆయన కేకలు విని చుట్టుపక్కల స్థానికులు కూడా దొంగలను పట్టుకోవడానికి వెంటపడినా ప్రయోజనం లేకపోయింది.
Also Read: వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం.. స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని ఎస్ఈసీకి లేఖ!
ఈ ఘటనపై చంపాలాల్ నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలిద్దరూ హెల్మెట్లు ధరించి ఉండటంతో వారిని గుర్తించడం కాస్త సవాలుగా మారిందని పోలీసులు చెబుతున్నారు. కాగా నిందితుల ఆచూకీ కోసం ఘటన జరిగిన ప్రాంతంలోని ఇతర సీసీటీవీలను సైతం పోలీసులు జల్లెడపడుతున్నారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు.
जयपुर 20 रुपए की कचौरी पड़ी 20 लाख रुपए की, नाहरगढ़ थाना इलाके में 20 लाख रुपए से भरे बैग को एक्टिवा पर रख कचौरी खा रहा था व्यापारी, पीछे से बाइक सवार दो बदमाश आए कैश से भरा बैग उड़ा ले गए ! https://t.co/uYlCFlGTOd
— Nazim Hasan (@NazimHasanRJ) October 27, 2026
Also Read: DPDP చట్టంపై సుప్రీంలో విచారణ.. జర్నలిస్టుల గోప్యత, స్వేచ్ఛపై కేంద్రానికి నోటీసులు!