Babar – Rohith : టీమిండియా (team india) వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2024 టీ-20 వరల్డ్ కప్ తరువాత టీ-20 క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు రోహిత్ శర్మ. అయితే అప్పటికే 4231 పరుగులు చేశాడు. ఇక త్వరలోనే ఆసియా కప్ 2025 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ పరుగుల రికార్డును పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం కేవలం 8 పరుగులు చేస్తే.. బ్రేక్ చేసే అవకాశం ఉండేది. కానీ ఊహించని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ కి బాబర్ ఆజంని సెలెక్ట్ చేయలేదు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టీ-20 సిరీస్ లో 1 మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ ల్లో బాబర్ ఆజం విఫలం చెందడంతో సెలక్ట్ చేయలేదు.
Also Read : Hardik Ex Wife Natasha : నటాషాకు అంత బలుపా.. సెల్ఫీ అడిగితే అలా తోసేసింది ఏంటి
రోహిత్ రికార్డు బ్రేక్ ని ఆపిన పీసీబీ..
దీంతో రోహిత్ శర్మ పరువు కాపాడినట్టు అయింది. ఒకవేళ బాబర్ కనుక టీ-20 జట్టులో ఉన్నట్టయితే కచ్చితంగా బాబర్.. రోహిత్ రికార్డును బ్రేక్ కచ్చితంగా చేసేవాడే. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ 4231 పరుగులు చేయగా.. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం (babr azam) 4223 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ రికార్డు ప్రస్తుతం సేఫ్ గానే ఉంది. ఆసియా కప్ 2025 కి సంబంధించి టీమ్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. అయితే అందులో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ని సెలెక్ట్ చేయకపోవడం గమనార్హం. గత కొద్ది రోజుల నుంచి ఫామ్ లో లేకపోవడంతో బాబర్ ని పీసీబీ సెలెక్ట్ చేయలేదు. దీనిపై అంతా చర్చించుకోవడం విశేషం. ఇక టీమిండియాలో ఇప్పటికే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారు టీ-20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీ-20 ఫార్మాట్ కి సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇండియాలో ఆ ఆటగాళ్లు కూడా దూరం..
మరోవైపు టీమిండియాలో శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ ని తీసుకోవడం కూడా సందేహంగానే మారింది. అదేవిధంగా రింకూ సింగ్ (Rinku singh) ని ఈ టోర్నీ నుంచి బయటికి పంపించవచ్చని ఓ నివేదిక పేర్కొంది. రిషబ్ పంత్ గాయం కారణంగా బాధపడుతుండటంతో జితేష్ శర్మను రెండో వికెట్ కీపర్ గా జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ ని టీ-20 జట్టులోకి తీసుకోవడం లేదని సమాచారం. పూర్తిగా యువ క్రికెటర్లతోనే ఈ టోర్నీలో రంగంలోకి దిగబోతుంది టీమిండియా. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనబోతున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.. సల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు బాబార్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ లపై పీసీబీ వేటు వేసింది. వీరిద్దరినీ ఆసియా కప్ లోకి తీసుకోలేదు. మరోవైపు శ్రీలంక జట్టు కూడా మ్యాథ్యూస్ లేకుండానే ఆసియా 2025 బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ కూడా షకీబ్ లేకుండాలోనే ఈ టోర్నీలో పాల్గొనబోతుంది.