Anupama parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా, మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ప్రస్తుతం పలు సినిమాల పనులలో బిజీగా ఉన్నారు. రచయితగా మొదలైన ఈయన ప్రయాణం దర్శకుడిగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి అద్భుతమైన హిట్ సినిమాలను అందించిన ఘనత త్రివిక్రమ్ కు ఉంది. ఇలాంటి గొప్ప దర్శకుడు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అయితే తాజాగా ఒక హీరోయిన్ మాత్రం త్రివిక్రమ్ ఎవరు నాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆ హీరోయిన్ ఎవరు. ఎందుకు అలా అన్నారూ? అనే విషయానికి వస్తే…
నాగవల్లి పాత్రలో మెప్పించిన అనుపమ..
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran)ఒకరు. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈమె తెలుగులో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “అ ఆ” (AAa Movie)సినిమాలో నాగవల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి పెద్దగా లేకపోయినా మంచి గుర్తింపు లభించింది. అయితే తాజాగా పరదా సినిమా(Parada Movie) ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనుపమ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
త్రివిక్రమ్ ఎవరో తెలియదా?
నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే నాకు తెలియదు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి అప్పట్లో పెద్దగా తెలియదు వంశీ నా దగ్గరకు వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాల్ చేశారని చెప్పడంతో త్రివిక్రమ్ ఎవరు అంటూ ప్రశ్నించాను. వెంటనే అతను ఒకసారి వెళ్లి వికీపీడియా చెక్ చెయ్యి అని చెప్పారు. అలా చెక్ చేయగానే త్రివిక్రమ్ గారంటే ఎవరు ఆయన సినిమాలు ఏంటో నాకు క్లియర్ గా అర్థమైందని తెలిపారు. ఇలా తెలుగులో అ ఆ సినిమా ఛాన్స్ కోసం అడుగుతున్నారని చెప్పగానే నాకు తెలుగు రాదని చాలా భయపడ్డాను.
తెలుగు గురించి అవగాహన లేదు..
త్రివిక్రమ్ గారు నేను ప్రేమమ్ సినిమాలో ఒక సాంగ్ లో కోప్పడుతున్న సన్నివేశంలో పెట్టిన ఎక్స్ప్రెషన్స్ నచ్చి అఆ సినిమా కోసం సంప్రదించారని ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఆ సమయంలో నాకు తెలుగు గురించి ఏమాత్రం అవగాహన లేదు కానీ ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చూసి తెలుగు గురించి కొంత తెలుసుకున్నానని, అలా మెల్లమెల్లగా తెలుగు మాట్లాడటం నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం జరుగుతుంది అంటూ అనుపమ ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అప్పట్లో నాకు త్రివిక్రమ్ అంటే ఎవరో తెలియదనే కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నటించిన పరదా సినిమా ఆగస్టు 22 తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Shruthi Hassan: పుట్టకముందే అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్!