Road Accident: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం వద్ద ప్రమాదం జరిగింది. హన్మకొండ- పరకాల ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Indian Air Force: భారత వాయుసేనలో నాన్- కంబాటెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.30వేలు
భారీ వాహనాలు నడుపుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. లేకుపోతే భారీ మూల్యం చెల్లించకోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైవేలపై అతివేగంగా ప్రయాణించొద్దని చెబుతున్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ.. అయినా మార్పు రావడంలేదు.
ALSO READ: Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే