E-Paper
Advertisement

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?
Advertisement

Director Atlee: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అట్లీ(Atlee) ఒకరు. ఇప్పటివరకు ఈయన కెరియర్ లో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడం విశేషం. అట్లీ తన తదుపరి సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో రాకా (Raaka)సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ముందుగా సినిమాలకు కమిట్ అవ్వను..

ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా దర్శకుడు అట్లీ తన కెరియర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాకా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఈయన మాట్లాడుతూ తాను ఒక సినిమా పూర్తి అయిన తరువాతనే వేరే సినిమా గురించి ఆలోచిస్తానని అప్పటివరకు ఇతర సినిమాలకు కూడా కమిట్ అవ్వనని తెలిపారు. ఇకపోతే తన కెరీర్ కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఈయన అభిమానులతో పంచుకున్నారు.

రెండు నెలలపాటు ఇండస్ట్రీకి బ్రేక్..

Advertisement

ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న రాకా సినిమా తరువాత తాను ఏ సినిమా చేయబోతున్నాను అనే విషయాలు గురించి తనకు కూడా తెలియదని తెలిపారు. అయితే తాను మాత్రం ఇండస్ట్రీకి చిన్న విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా అట్లీ తెలిపారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక రెండు నెలల పాటు తాను తన సొంత గ్రామంలోకి వెళ్లి ఉండాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఎలాగైతే రజినీకాంత్ ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లి వస్తారో తాను కూడా ఈ సినిమా తర్వాత తన సొంత గ్రామానికి వెళ్లాలని
నిర్ణయం తీసుకున్నానని అట్లీ వెల్లడించారు.

సినిమాలలో తప్పులను సరిదిద్దుకుంటాను..

రెండు నెలల కాలంలో తాను తన సినిమాల విషయంలో ఎలాంటి తప్పులు చేశాను? ఇలాంటి విషయాలను ఎలా సరిద్దుకోవాలి ? తన సినిమాలో ప్లస్ పాయింట్ , మైనస్ పాయింట్లు ఏవీ అనే అంశాల గురించి తనని తాను ప్రశ్నించుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటానని ఈయన తెలియజేశారు. ఇలా అట్లీ రాకా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్నారని, రామ్ చరణ్ నటించబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అన్నింటికి కూడా అట్లీ ఈ విధంగా చెక్ పెట్టారని తెలుస్తోంది.

Advertisement

Also Read: సింగీతం శ్రీనివాసరావు చివరి కోరిక అదేనా?నెరవేరకుండానే కన్నుమూశారా?

Related News

ఇరుముడి డైరెక్టర్‌తో ఈసారి జత కట్టేదెవరో?

సింగీతం శ్రీనివాసరావు చివరి కోరిక అదేనా?నెరవేరకుండానే కన్నుమూశారా?

సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్!

లైగర్ డిజాస్టర్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన విజయ్..చాలా కష్టపడ్డాను కానీ?

లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన విరోష్ జంట.. ధర ఎంతంటే?

అరాచకం సృష్టిస్తున్న శర్వానంద్.. ‘భోగి’ టీజర్ ఎలా ఉందంటే?

మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!

Big Stories

Advertisement
×