E-Paper
Advertisement

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?
Advertisement

Rashmika -Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న (Rashmika Mandanna)జంట ఒకటి. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వివాహపు వేడుకలలో భాగంగా విజయ్ దేవరకొండ లుక్ భారీగా వైరల్ అయింది. ఇలా పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ మొదటిసారి రణబాలి(Ranabaali) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

విజయ్ దేవరకొండ పెళ్లి.. పెరిగిన బంగారం ధరలు..

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ రష్మిక డైరెక్టర్ రాహుల్ ముగ్గురు కలిసి యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా సుమ వీరు పెళ్లి గురించి ప్రశ్నిస్తూ మీరు పెళ్లి కొడుకుగా చాలా అందంగా ముస్తాబయ్యారు అదే సమయంలోనే బంగారం ధరలు కూడా పెరిగిపోయాయి… మరోవైపు ఏందయ్యా స్వామి కూడా విడుదల అయింది అంటూ మాట్లాడరు..

బీచ్ లో పెళ్లంటే అమ్మ ఏడ్చింది..

Advertisement

సుమ ఇలా మాట్లాడటంతో వెంటనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అసలు తన పెళ్లి ఆలోచన రెండు విధాలుగా ఉండేదని తెలిపారు. ఒకటి సింపుల్ గా షాట్ వేసుకొని బీచ్ లో తన మెడలో తాళి కట్టాలి లేదా తాను ఒక కింగులా పెళ్లి మండపంలోకి వచ్చేలాగా అయిన పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. సింపుల్ గా బీచ్ లోనే పెళ్లి చేసుకోవాలని భావించాను, అందుకు సంబంధించి కొన్ని ఎంక్వయిరీస్ కూడా చేశానని తెలిపారు. ఈ విషయం మా అమ్మతో చెబితే 10 రోజుల పాటు మా అమ్మ నా పెళ్లి గురించి ఏడ్చిందని తెలిపారు. నీ పెళ్లి విషయంలో నేను ఎన్నో కలలు కన్నానని నాకు ఎన్నో కోరికలు ఉన్నాయని అమ్మ ఏడుపు మొదలు పెట్టడంతో ఇక విషయం నాకు అర్థమై అలా ఉదయపూర్ లో ప్లాన్ చేసామని విజయ్ దేవరకొండ తెలిపారు.

డియర్ కామ్రేడ్ సమయంలోనే ప్రేమ..

రష్మిక కూడా మాట్లాడుతూ విజయ్ పెళ్లి గురించి రెండు ఆలోచనలు ఉన్నాయి కానీ ఏ నిర్ణయం తీసుకున్న నాకు సంతోషమే అని నేను సైలెంట్ గానే ఉన్నానని రష్మిక తెలిపారు. మొదటిసారి ఇలా విజయ్ రష్మిక తమ పెళ్లి ఉదయపూర్ లో జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలియచేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట ఇన్నేళ్ల పాటు ప్రేమలో కొనసాగుతూ ఈ ఏడాది పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహపు వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

Related News

‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

రాకా కోసం అల్లు అర్జున్ తీసుకుంటుంది ఎంతో తెలుసా?

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

ఇరుముడి డైరెక్టర్‌తో ఈసారి జత కట్టేదెవరో?

సింగీతం శ్రీనివాసరావు చివరి కోరిక అదేనా?నెరవేరకుండానే కన్నుమూశారా?

Big Stories

Advertisement
×