BigTV English

Ileana D’Cruz: సినిమాలకు మళ్లీ దూరం కానున్న ఇలియానా.. అసలు రీజన్ ఇదే అంటూ!

Ileana D’Cruz: సినిమాలకు మళ్లీ దూరం కానున్న ఇలియానా.. అసలు రీజన్ ఇదే అంటూ!

Ileana D’Cruz:ఇలియానా (Ileana D’Cruz).. రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా వచ్చిన ‘పోకిరి’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో జులాయి, పవన్ కళ్యాణ్ తో జల్సా, రవితేజ తో కిక్ వంటి సినిమాలు చేసి వరుసగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఒకవైపు టాలీవుడ్, మరొకవైపు కోలీవుడ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. 2023లో ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తను పరిచయం చేసి ట్రోల్స్ కి చెక్ పెట్టింది. తన మొదటి కొడుకుకు కోవా ఫినిక్స్ డోలన్ అని నామకరణం కూడా చేసింది. ఇక ఇటీవలే రెండోసారి కూడా తల్లి అయిన విషయం తెలిసిందే. మళ్ళీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ.


మళ్లీ ఇండస్ట్రీకి దూరం కాబోతున్న ఇలియానా..

ఇదంతా బాగానే ఉన్నా సినిమాలలో ఇలియానా రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఏడాది ‘తేరా క్యా హోగా లవ్లీ’, ‘ దో ఔర్ దో ప్యార్’ అనే చిత్రాలతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఇక వరుసగా సినిమాలలో నటిస్తుంది అనుకునే లోపే మళ్లీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఇలియానా. ఇప్పటికే రీ ఎంట్రీలో భాగంగా రెండు చిత్రాలు చేసిన ఈమె మళ్లీ ఇండస్ట్రీకి దూరం కాబోతుండడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు కారణం ఏంటంటే?

ఇక దీనిపై ఇలియానా మాట్లాడుతూ..” నేను వెండితెరను, నటనను ఎంతో మిస్ అవుతున్నాను. ప్రస్తుతం తల్లిగా ఇద్దరు కుమారుల ఆలనా పాలన చూసుకుంటూ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. నేను సినిమాల పైన దృష్టి పెడితే ఇక్కడ పిల్లలకు నా ప్రేమను పంచడం సాధ్యం కాదు. అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లోకి వస్తాను. అయితే ప్రస్తుతం పిల్లల బాధ్యతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. అందుకే మళ్ళీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాను అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను” అంటూ స్పష్టం చేసింది ఇలియానా. మొత్తానికైతే ఇలియానా చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


గతంలో రీ ఎంట్రీ పై కామెంట్స్..

ఇదిలా ఉండగా గతంలో రీ ఎంట్రీ కోసం దర్శక నిర్మాతలను సంప్రదించగా అప్పుడు ఆమె ఈ విధంగా తెలిపింది. “ఇండస్ట్రీని నేను ఎంతగానో మిస్ అవుతున్నాను. రైడ్ నాకు ఒక ప్రత్యేకమైన మూవీ. ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నప్పుడు చిత్ర బృందం నన్ను సంప్రదించింది. అప్పుడే నాకు బాబు పుట్టాడు. దీంతో ఈ సినిమా చేయలేకపోయాను. కానీ మీ అందరి కోసం మళ్లీ కం బ్యాక్ ఇస్తాను. ప్రస్తుతం 24 గంటలు ప్రతిరోజు రెస్ట్ అనేదే ఉండడం లేదు. కానీ ఎంత కష్టంగా ఉన్నా కూడా నా బిడ్డ స్మైల్, స్పర్శతో అవన్నీ మాయమవుతున్నాయి. మాతృత్వం అనేది ఒక గొప్ప ఫీలింగ్” అంటూ అప్పుడు రిప్లై ఇచ్చింది.

ALSO READ:Mohan Sri Vasta: నన్ను క్షమించండి.. అందుకే చెప్పుతో కొట్టుకున్నా -డైరెక్టర్ మోహన్!

Related News

Naga Chaitanya Samantha : సమంత కేసు… మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన నాగార్జున, నాగ చైతన్య

Little Hearts Making Video: ఒక్క చిన్న వీడియో… బుడ్డోళ్లు ఇండస్ట్రీ మొత్తాన్ని ట్రోల్ చేశారు

Spirit : అయ్యో ప్రభాస్ కి ఏమైంది, మరి అంతలా తగ్గిపోయాడు ఏంటి?

Anupama Parameswaran: ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. స్టేజ్‌పైన అనుపమ

MSG Movie: MSG సెట్లోకి వెంకీమామ ఎంట్రీ.. అప్పుడే టాకీ పార్ట్‌ కూడా పూర్తి .!

Yellamma Movie : చివరికి ఎల్లమ్మకే ఎసరు పెట్టారా… కథలో భారీ మార్పులు ?

Big Stories

×