Rajma Beans: రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చాలా మంది వంటకాల తయారీలో కూడా రాజ్మాను ఉపయోగిస్తారు. రాజ్మా కేవలం వంటకాలకు రుచిని అందించడమే కాదు శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిక్కుడు జాతికి చెందిన గింజలలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్మా వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యానికి మేలు:
రాజ్మాలో పీచుపదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఈ పీచుపదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే.. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె కండరాల పనితీరును మెరుగుపరచి, మొత్తం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బరువు తగ్గడానికి సహాయం:
మీరు బరువు తగ్గాలనుకుంటే.. రాజ్మా ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉన్న అధిక పీచుపదార్థం, ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. అలాగే.. రాజ్మాలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి నిదానంగా శక్తిని అందిస్తాయి. ఇది అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుదల:
రాజ్మాలో ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థకు చాలా ముఖ్యమైంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా పేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ, శరీరంలోని పోషకాలను సమర్థవంతంగా గ్రహించుకోవడానికి కూడా ఇది సహాయ పడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:
రాజ్‌మాలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. అంటే.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. అందుకే.. మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం.
ఎముకలకు బలం:
రాజ్మాలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, సాంద్రతకు చాలా అవసరం. క్రమం తప్పకుండా రాజ్మా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. వృద్ధాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) వంటి సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
Also Read: గ్రీన్ టీ ఇలా తాగితే.. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు తెలుసా ?
శక్తిని పెంచుతుంది:
రాజ్మాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను నివారించడంలో రాజ్మా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
మొత్తంగా.. రాజ్మా ఒక పోషకాల గని. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు పీచుపదార్థం, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చు. ఇది గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు, బరువు తగ్గడం నుంచి ఎముకల బలం వరకు అనేక విధాలుగా మన శరీరానికి మేలు చేస్తుంది. రాజ్మాను కర్రీగా లేదా సలాడ్స్‌లో కూడా తీసుకోవచ్చు.