E-Paper
Advertisement

అందమైన అమ్మాయితో రూమ్ షేరింగ్.. తీరా చూస్తే సీన్ రివర్స్!

అందమైన అమ్మాయితో రూమ్ షేరింగ్.. తీరా చూస్తే సీన్ రివర్స్!
Advertisement

Immortal Trailer: జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను తమిళ సూపర్‌స్టార్ ధనుష్ తన ఎక్స్ ఖాతా ద్వారా రిలీజ్ చేయడం విశేషం.

గతేడాది విడుదలైన టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ, ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందనే చెప్పాలి.అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించిన ఈ చిత్రంలో టీఎమ్ కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కతిర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమా కథ ఏంటంటే 

Advertisement

ట్రైలర్ చూస్తె విదేశీ గిరిజన జంట తమ సంతానం కోసం చేసే ఒక పురాతన పూజ లేదా ఆచారంతో కథ మొదలవుతుంది.అక్కడ నుంచి సీన్ ఇండియాకి షిఫ్ట్ అయి, మహి (జీవీ ప్రకాశ్) రూమ్ షేరింగ్ కోసం వెతికే  సీన్స్ తో సాగుతుంది. సరిగ్గా అదే సమయంలో అందమైన, రిచ్  సింధు (కయాదు లోహర్) పరిచయమై, తాను ఒంటరిగా ఉంటున్న ఫ్లాట్‌లో షేరింగ్‌కి ఆహ్వానిస్తుంది.అలా మహి కూడా ఆ ప్లాట్‌లో అడుగుపెడతాడు.

కానీ ఆ ఫ్లాట్‌లోకి వెళ్లాకే అసలు భయంకరమైన కథ మొదలవుతుంది. రాత్రి వేళల్లో వింత శబ్దాలు, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి . అవన్నీ అతడిని పిచ్చివాడిని చేస్తుంటాయి. అసలు ఈ దెయ్యాల గోల వెనుక ఉన్న నిజం ఏంటి? ప్లాట్‌లో ఏం జరుగుతుందో సింధుకు ముందే తెలుసా? విదేశీ గిరిజన పూజలకి, ఈ సిటీ రూమ్‌కి ఉన్న లింక్ ఏంటి? అన్నదే సినిమా కథని తెలుస్తుంది.

కంప్లీట్ డార్క్ అండ్ ప్యూర్ థ్రిల్లర్‌

Advertisement

ఈ మధ్య కాలంలో వస్తున్న ‘కాన్జ్యూరింగ్’ లేదా ‘గృహం’ తరహా సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల ముందుకు తెస్తూనే, పురాతన మైథాలజీని ఆధునిక సిటీ లైఫ్‌కి ముడిపెట్టినట్లు అర్థమవుతోంది. గతంలో జీవీ ప్రకాశ్ నటించిన ‘డార్లింగ్’ హారర్ కామెడీ జానర్ లో రాగా ఇది మాత్రం కంప్లీట్ డార్క్ అండ్ ప్యూర్ థ్రిల్లర్‌గా సాగనుందని తెలుస్తుంది.

ఇక అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ, సామ్ సీఎస్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.

ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !

ఇక షూటింగ్ ఈ ఏడాది మే నెలలోనే పూర్తయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘U’ సర్టిఫికెట్ లభించడం విశేషం. సాధారణంగా హారర్ సినిమాలకు ‘A’ లేదా ‘U/A’ ఇస్తుంటారు, కానీ ‘U’ రావడం వల్ల ఇది ఫ్యామిలీ కలిసి చూడదగ్గ క్లీన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

శాన్ లోకేశ్ ఎడిటింగ్, శివ శంకర్ ఆర్ట్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.చూడాలి మరి మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న జీవి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !

Tags

Related News

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×