E-Paper
Advertisement

200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?

200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?
Advertisement

Irmudi Box Office: ఒకటి కాదు రెండు కాదు..రావణాసుర,టైగర్ నాగేశ్వరరావు ,ఈగల్ ,మిస్టర్ బచ్చన్ , మాస్ జాతర , భర్త మహాశయులకు విజ్ఞప్తి(హిట్ అని మేకర్స్ అంటుంటారు) అంటూ వరుసగా ఆరు అట్టర్ ప్లాపులు.ఈ పరిస్థితి ఇంకో హీరోకే వచ్చి ఉంటె ఈపాటికే పెట్టేబేడా సర్దేసుకుపోయేవాడు.

కాని అక్కడున్నది అక్షరాల రవితేజ.ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వాడు కూడా ఇండస్ట్రీని ఏలోచ్చు అని మెగాస్టార్ తర్వాత ప్రూవ్ చేసుకున్న కటౌట్ అది.అలాంటి వారియర్ అంత ఈజీగా చేతులెలా ఎత్తేస్తాడు.సాలిడ్ హిట్టు కొట్టేంత వరకు ఆపేదే లేదంటూ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.

దాదాపు 130 కోట్ల పై చిలుకు వసూళ్లతో

Advertisement

ఇదిగో అప్పుడు వచ్చాడు శివ నిర్వాణ. నాగచైతన్య చుట్టూ సినిమా అంటూ గింగిరాలు తిరిగి అలసిపోయిన శివ నిర్వాణకి చీకట్లో దీపం లా కనిపించాడు రవితేజ.ఇంకేం ఒకరి మధ్య ఒకరికి సింక్ అవడంతో సాలిడ్ గా పేలింది ఇరుముడి.రిలీజ్ కి ముందు మోస్తరు అంచనాలే ఉన్న ఈ సినిమా రోజు రోజుకి బాక్సాఫీస్ వద్ద రుద్ర తాండవం చేస్తుంది.

అది ఏ రేంజ్ లో అంటే రిలీజ్ అయిన వారంలోపే సెంచరీ కొట్టేంత. అక్కడితో ఆగకుండా ఇపుడు దాదాపు 130 కోట్ల పై చిలుకు వసూళ్లతో దూసుకుపోతుందన్నది ట్రేడ్ వర్గాల రిపోర్ట్.ఒక వైపు టాక్సిక్ రిలీజ్ అవుతుండటంతో ఇరుముడి వెనక్కి తగ్గుతుందేమో అని లెక్కలేశారంతా.కానీ టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో ఆ టాక్ కాస్తా ఇరుముడికి మరింత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

భుజాలపైకి ఎత్తుకున్న భక్త ప్రేక్షకులు

Advertisement

మామూలుగా ఇలాంటి పెద్ద సినిమాలు హీరో పేరు మీద కాసింత జోరు చూపించి వెనక్కి తగ్గిపోతాయ్.కాని ఈ సినిమా విషయంలో మాత్రం జరిగింది వేరు.క్యాస్టింగ్ కన్నా కథలోని కంటెంట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.ముఖ్యంగా త్రినాధ్ గా రవితేజ, మానేమ్మగా నక్షత్ర ల మధ్య పండిన ఎమోషన్స్ ప్రేక్షకులకి కన్నీళ్ళు తెప్పిస్తుంది.పైగా సినిమా అయ్యప్ప స్వామి నేపథ్యం అవడంతో భక్త ప్రేక్షకులు ఇరుముడిని భుజాలపైకి ఎత్తుకున్నారు.

 రెండొందల కోట్ల క్లబ్ లోకి అడుగుపెడతాడో

ఇక ప్రస్తుతం ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు బరిలో లేకపోవడం, టాక్సిక్ సో సో గా ఉండటం, ఇరుముడి సినిమా ఇంకా మేజర్ థియేటర్ లని హోల్డ్ చేయడం చూస్తుంటే వచ్చే వారం కల్లా సినిమా రెండు వందల కోట్లకి చేరినా ఆశ్చర్యం లేదు.అదే జరిగితే మాత్రం మిరాకిలే అనుకోవాలి.

కేవలం 40 కోట్లతో తెరకెక్కిన సినిమా ఐదింతలు వసూలు చేయడం అంటే ,మామూలు విషయం కాదు మరి.కావలసినదల్లా ఈ వీకెండ్ ఇరుముడి సినిమా ఇలాగే థియేటర్ లని హోల్డ్ చేసి జోరుగా సాగుతున్న కలెక్షన్స్ ని కంటిన్యూ చేయడమే.చూడాలి అభిమానులు కోరుకుంటున్నట్టుగా మాస్ మహారాజ్ ఎప్పటికల్లా రెండొందల కోట్ల క్లబ్ లోకి అడుగుపెడతాడో !

Tags

Related News

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్.. లుక్ టెస్ట్ పూర్తి?

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!

రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!

శ్రీ పట్టాభి రామచంద్ర ఆలయ ప్రతిష్ట మహోత్సవం.. ముఖ్య అతిథులుగా దిల్ రాజు దంపతులు!

టాక్సిక్ అప్పుడే చేతులెత్తేసిందా?

రక్షాబంధన్ స్పెషల్… శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్!

మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!

Big Stories

Advertisement
×