Nagababu: సినీ నటుడు, నిర్మాత, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Nagababu)కు ఇటీవల ఏపీ క్యాబినెట్ లో హోదా కల్పించిన విషయం మనకు తెలిసిందే. జనసేన ఎమ్మెల్సీగా బాధ్యతలను నిర్వహిస్తున్న నాగబాబుకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్(AP Green Executive committe Chairman) గా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే నేడు నాగబాబు అధికారకంగా తన బాధ్యతలను స్వీకరించారు. నేడు (శుక్రవారం) మంగళగిరిలోని అరణ్య భవన్ లో ఈయన వేద పండితుల సమక్షంలో ఆశీర్వాదాలు తీసుకొని బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అరణ్య భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబుతో పాటు ఆయన సతీమణి పద్మజ కూడా పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం నాగబాబు చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వహక కమిటీ చైర్మన్ గా నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాను కల్పించింది. ఈ నేపథ్యంలోనే పలువురు అటవీ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన చైర్మన్ కు అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సైతం అభినందనలు తెలిపారు.
ఏపీ గ్రీన్ సంకల్పాన్ని నాగబాబుగారు సమర్థంగా అమలు చేయాలని కోరారు. 20047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతాన్ని పచ్చదనంతో నింపే బృహత్ కార్యాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్లను ఉన్నారని తెలిపారు. ప్రకృతి పట్ల అపారమైన ప్రేమ కలిగిన శ్రీ నాగబాబు గారు ఏపీ గ్రీన్ సంకల్పాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. నాగబాబుకు ఈ విధమైనటువంటి హోదా కల్పించిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రికి అలాగే నాగబాబు గారికి మద్దతు ఇచ్చిన కూటమి పక్షాల నాయకులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏపీ-గ్రీన్ సంకల్పాన్ని శ్రీ నాగబాబు గారు సమర్థంగా అమలు చేయాలి
పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ ఎన్రిచ్మెంట్ నెట్వర్క్ (ఏపీ-గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు… pic.twitter.com/YDNMKnNKV3
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 28, 2026
ఈ విధంగా నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడంతో మెగా కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు. నటుడిగా నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాగబాబు ఇప్పుడు రాజకీయపరంగా ప్రజా సేవలో భాగమయ్యారు. గత కొంతకాలంగా జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ పార్టీకి అండగా నిలబడిన నాగబాబుకు నేడు ఉన్నత హోదా కల్పించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అలాగే తనకు ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: రక్షాబంధన్ స్పెషల్… శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్!