E-Paper
Advertisement

థియేటర్లలో భజనలు..బయటి నుంచి కుర్చీలు! ‘ఇరుముడి’ వీడియో వైరల్!

థియేటర్లలో భజనలు..బయటి నుంచి కుర్చీలు! ‘ఇరుముడి’ వీడియో వైరల్!
Advertisement

Irumudi Movie Craze: భక్తి సినిమాలు సరిగ్గా ట్రిగ్గర్ అయితే ఎలా ఉంటుందో, ఆడియన్స్ ఎలా నీరాజనాలు పలుకుతారో ఇరుముడి సినిమా మరో సారి ప్రూవ్ చేస్తుంది. సినిమా రిలీజ్ అయి ఇప్పటికి ఆరు రోజులు అయినప్పటికీ చాలా థియేటర్ లలో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులే వేలాడుతున్నాయంటే సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఎలా ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాకి సంబందించిన వార్తలే

మాములుగా స్టార్ హీరో ఉన్న ఏ సినిమాకైనా మొదటి రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చాలా కామన్.కానీ సినిమా రోజురోజుకి సాలిడ్ వసూల్లని నమోదు చేస్తుండటం,టాక్సిక్ సినిమా వచ్చినప్పటికీ ఇదే సినిమా కావాలంటూ థియేటర్ల వద్ద ధర్నాలు చేయడం బట్టి చూస్తే ఈ సినిమాని ఆడియన్స్ అంతలా నెత్తిన పెట్టుకోవడానికి బలమైన కనెక్షన్ ఉండే ఉండాలి.ఇపుడు మొత్తం ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబందించిన వార్తలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం దాన్ని ప్రూవ్ చేస్తుంది కూడా.

బయటినుండి మరిన్నికుర్చీలు

Advertisement

ఇదిలా ఉంటె తాజాగా థియేటర్ లలో ఉన్నసీట్లు సరిపోక బయటినుండి మరిన్నికుర్చీలు తెప్పించడం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మాములుగా సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా బోసిపోయిన హాళ్ళు, ఖాళీ కుర్చీలే దర్శనమిస్తుంటాయి.ఇక ఇప్పుడున్న OTT యుగంలో అసలు ఆడియన్స్ థియేటర్ మొహం చూడటానికే సాహసించడం లేదు.అలాంటి ఈ కాలంలో ఉన్న కుర్చీలు సరిపోక ఇలా బయటి నుండి ఎక్స్ట్రా చెయిర్స్ తెచ్చి వేయడం చూస్తుంటే ఇరుముడి సినిమా థియేటర్ లని ఇప్పట్లో వదిలేలా లేదని అర్థమవుతుంది.

Advertisement

ఇక మరి కొన్ని థియేటర్లలో వచ్చిన భక్తులు సినిమాని తలుచుకుంటూ భజనలు చేస్తుండటం విశేషం.ముఖ్యంగా ఈ సినిమాకి ఎక్కువ సంఖ్యలో మహిళా ప్రేక్షకులు నీరాజనం పట్టడం చూస్తుంటే రవితేజకి, మానేమ్మ కి మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్స్ బాగా అలరించాయని అర్థం అవుతుంది.

నిజానికి గత కొన్నేల్లలో దేవుడి బ్యాక్ డ్రాప్ లో హనుమాన్, కార్తికేయ2, కాంతారా,మహావతార్ నరసింహ అంటూ చాలా సినిమాలే థియేటర్ లని పలకరించాయి.ఇక ఈ సినిమాలు కూడా ఆడియన్స్ ని భక్తి పారవశ్యంలో ముంచి కోట్లు కొల్లగొట్టాయి కూడా.

అయితే అయ్యప్ప స్వామి నేపథ్యంలో వచ్చిన ఇరుముడి సినిమాకి వచ్చినంత మాస్ క్రేజ్ వాటికి రాలేదు అనడంలో సందేహం లేదు. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి ఎన్నో వీడియోలే సినిమాకి ఉచిత పబ్లిసిటీని,మరియూ ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెడుతున్నాయి.

also read :ఇరుముడి దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. టాప్-5లోకి ఎంట్రీ!

చూడాలి మరి ప్రేక్షక భక్తులు నెట్టి మీద పెట్టుకున్న సినిమా ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తుందో !

Tags

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×