E-Paper
Advertisement

మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు షురూ… సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్?

మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు షురూ… సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్?
Advertisement

Sai Dharam Tej Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్స్ గా కొనసాగుతున్న నటుడు తేజ సజ్జ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆయన ఈ వార్తలపై స్పందిస్తూ తాను పెళ్లి చేసుకోబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా మరొక హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

నవంబర్ 5న నిశ్చితార్థం..

సాయి తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈయన కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని తెలుస్తోంది. తాజాగా ఈయన ఎంగేజ్మెంట్(Engagment) పెళ్లికి (Wedding)సంబంధించి వార్తలు మెగా కాంపౌండ్ నుంచి లీక్ అయ్యాయని సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకనుగుణంగా సాయి ధరంతేజ్ నవంబర్ 5వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుక పూర్తిగా ప్రవేట్ ఈవెంట్ లాగే జరగబోతుందని సమాచారం.

హైదరాబాద్ లో సాయి తేజ్ వివాహం..

Advertisement

ఇలా నవంబర్ లో నిశ్చితార్థం జరుపుకుంటున్న సాయితేజ్ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే అందరూ అనుకున్నట్టు సాయి తేజ్ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కాదని ఈయన హైదరాబాద్లోనే తన వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన వేదిక కూడ ఫైనల్ అయిందని త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను అధికారకంగా తెలియచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సాయి దుర్గా తేజ్ పెళ్లికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.

అమ్మాయి ఎవరంటే?

ఇక సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం పెళ్లికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి కానీ అమ్మాయి వివరాలను మాత్రం ఇప్పటివరకు ఎక్కడ వెల్లడించలేదు. అయితే తన వివాహం మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. గతంలో సాయి దుర్గ తేజ్ తన లవ్ స్టోరీ గురించి కూడా తెలిపారు. తన లవ్ బ్రేకప్ అయ్యిందని, లవ్ బ్రేకప్ కావడంతో సాయి తేజ్ పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ పెళ్లి వార్తలపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలి అంటే మెగా ఫ్యామిలీ అధికారకంగా ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.ఇక సాయి తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం తెలియజేశారు. మరి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!

Related News

గురూజీ – వెంకీ మ్యాజిక్ వర్కౌట్ కాలేదా? ఏకంగా అన్ని కోట్లు నష్టమా?

ప్రాణభయంలో బిగ్ బీ..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సాయంతో ఫ్యాన్స్ కు అభివాదం!

నాకు ఆ పాటకు సంబంధం లేదు.. యూటర్న్ తీసుకున్న జిమ్ జిమ్ తార సింగర్!

నెపోటిజం చూపిస్తున్న నిహారిక.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన టీమ్!

రూ.200 కోట్ల ఆర్థిక దోపిడీ కేసులో నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు మరోసారి సమన్లు!

ఫేక్ గురూ అంటూ పూనమ్ కౌర్ మరో షాకింగ్ పోస్ట్!

అబ్బా.. ఏం అందం! ప్రిన్సెస్‌లా మారిపోయిన రవీనా కూతురు!

Big Stories

Advertisement
×