E-Paper
Advertisement

ఎట్టకేలకు లైవ్ లో దీపికాకు ప్రపోజ్ చేసిన జీవన్!

ఎట్టకేలకు లైవ్ లో దీపికాకు ప్రపోజ్ చేసిన జీవన్!
Advertisement

Deepika Rangaraju:టీవీ షోలలో, రియాలిటీ షోలలో ఎక్కువగా లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తూ షో కి మంచి టిఆర్పి రేటింగ్ తీసుకురావడానికి నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కసారి ఈ లవ్ ట్రాక్ లు గాడి తప్పుతూ విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటాయి. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకో అంటూ దీపికా రంగరాజు జీవన్ వెంటపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక షో లవ్ ట్రాక్ కాస్త మరో షో కి కూడా వ్యాపించి.. ఏకంగా అక్కడ కూడా వీరిద్దరి లవ్ ట్రాక్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు ఆమె ప్రేమను జీవన్ ఒప్పుకోవడం సంచలనంగా మారింది.

హమ్మయ్య దీపికా ఎదురుచూపులకు శుభం కార్డ్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ యాంకర్ సుమా కనకాల (Suma Kanakala), లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) కలయికలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న ఎంటర్టైన్మెంట్ షో ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె’. ప్రస్తుతం ఆరవ సీజన్ నడుస్తుండగా 9వ ఎపిసోడ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో జీవన్, దీపిక లవ్ ను యాక్సెప్ట్ చేస్తూ ఆమెకు ప్రపోజ్ చేయడం వైరల్గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. నవంబర్ 5వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా వేదికగా ప్రీమియర్ కానున్న ఈ తొమ్మిదవ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. పైగా సెమీ ఫైనల్ లో భాగంగా జిమ్ థీమ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

డైలాగ్ లతో ఆకట్టుకున్న దీపిక..

Advertisement

ఆద్యంతం నవ్వులతో సాగిన ఈ ప్రోమోలో దీపిక ఎంట్రీ ఇచ్చి తన మాటలతో గలగల మాట్లాడుతూ.. ప్రోమోను మరింత ఆసక్తికరంగా మార్చింది. చివర్లో జీవన్ ఎంట్రీ ఇవ్వగానే ఒక మూలన దాక్కున్న ఈమె.. ఆయన స్టేజ్ పైకి రాగానే ఎంట్రీ ఇచ్చింది. అసలు జీవన్ వస్తున్నట్లు నీకు ఎవరు చెప్పారు? అని సుమ అడగగా.. పిడుగు పడిందని చెట్టుకు ఎవరైనా చెప్పాలా? జలుబు వచ్చిందని ముక్కుకు ఎవరైనా చెప్పాలా? అంటూ డైలాగులు చెబుతుండగానే.. మధ్యలో అర్జున్ కలగజేసుకొని.. ఇలాంటి సీన్ చూసాక ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా చెప్పాలా? అంటూ ఝలక్ ఇచ్చాడు. ఇక మధ్యలో నందిని రెడ్డి కలగజేసుకొని.. జీవన్ ఈ మధ్యలో చాలా జరిగినట్టు ఉన్నాయి అని అడగగా.. ఏం జరిగింది మేడం అంటూ చెప్పాడు. ఇక దీపిక మాట్లాడుతూ..” ఇంకా ఏం జరగలేదు. అందుకే ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు” అంటూ కామెంట్ చేసింది. దీంతో జీవన్ ఊరుకోవే తల్లి నీకు దండం పెడతాను అంటూ తన డైలాగ్ తో నవ్వులు పూయించాడు.

also read:బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం.. దెబ్బకు రంగంలోకి పేరెంట్స్.. కట్ చేస్తే!

దీపికాకు లవ్ ప్రపోజ్ చేసిన జీవన్..

Advertisement

ఇక తర్వాత దీపికాతో మాట్లాడుతూ.. “నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఇన్ని రోజులు జీవన్ ప్రపోజ్ కోసం ఎదురుచూసిన దీపిక ఆయన ఆ మాట చెప్పడంతో ఒక్కసారిగా మెలికలు తిరిగిపోయింది. మొత్తానికి అయితే సెమీ ఫైనల్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం.. దెబ్బకు రంగంలోకి పేరెంట్స్.. కట్ చేస్తే!

నాన్న అరెస్ట్ తట్టుకోలేకపోయాను..పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్!

ఝాన్సీ ఎలిమినేషన్ కి ముఖేష్ కారణమా.. హీటెక్కిన నామినేషన్ వార్!

అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!

8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?

రోహిత్ పై ప్రశంసల కురిపించిన శివాజీ.. ఎలిమినేషన్ పై రియాక్షన్?

అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Big Stories

Advertisement
×