Jagtial Adoption: జగిత్యాల జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన అందరిని కలిచివేసింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. అయితే చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓ చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి అధికారులు తరలించారు. ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న తన చిన్నారిని చూసేందుకు వెళ్లగా “నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే మేము హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని తల్లితండ్రులు హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు సైతం అక్టోబర్ 16వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని దత్తత తీసుకున్న తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
దత్త తీసుకున్న వారి తల్లితండ్రులను చూడగా ఆ పిల్లవాడు కేకలు పెడుతూ నన్నూ తీసుకెల్లండి అంటూ రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా శిశు సంక్షేమ అధికారులు ఇలా ఇబ్బంది పెట్టడంతో నెట్టింట ఉన్న వారు అధికారుల తీరుపై విరుచుకు పడుతున్నారు. వెంటనే ఆ చిన్నోడిని పంపిచాలని కోరుతున్నారు.
Also Read: ఆన్‌లైన్ హోటల్ రివ్యూలు చూసి మోసపోతున్నారా? ఫేక్ రివ్యూలను కనిపెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!