E-Paper
Advertisement

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు
Advertisement

WaQar Azam On IND VS PAK:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గత వారంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ లో ఇప్పటి వరకు పది మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇక దీపావళి రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) జూనియర్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇండియాను కించపరుస్తూ పాకిస్తాన్ మాజీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. ఇండియా పరువు పోయిందని అంటున్నారు.

మిస్ట‌ర్ న‌ఖ్వీ.. నా ఇంటికి వ‌చ్చి చెక్కుల‌ను తీసుకువెళ్లు

ఆసియా కప్ 2026 అండర్ 19 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోర్ట్స్ అన‌లిస్ట్ వకార్ అజామ్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. భారత జట్టును ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి 15 వేల పాకిస్తాన్ రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంటే భార‌త క‌రెన్సీలో రూ.5000 అన్న‌మాట‌. అయితే ఈ నజరానాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యులలో ఎవరో ఒకరు తన ఇంటికి వచ్చి తీసుకువెళ్లాలని వెల్లడించాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

15 మంది క్రికెటర్ల కోసం 15 చెక్కులు తాను సిద్ధంగా ఉంచాలని వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ న‌ఖ్వీ వ‌చ్చి ఆ చెక్కులను తీసుకువెళ్లాలని కోరాడు. లేదా ఓ వ్య‌క్తిని పంపించినా అప్ప‌గిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్ళాలని టీమ్ ఇండియాను ప్రతిచోటా ఓడించాలని పిలుపునిచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియాను ఓడించే దిశగా సీనియర్ పాకిస్తాన్లు అడుగులు వేయాలని కోరాడు.

న్యూజిలాండ్ పై భారత జట్టు వన్డే సిరీస్ గెలిస్తే గుండు గీయించుకుంటా

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కూడా స్పోర్ట్స్ అన‌లిస్ట్ వకార్ అజామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా గెలిస్తే తాను గుండు గీయించుకుంటానని ప్రకటించాడు. టి20 సిరీస్ గుడ్డిలో మెల్లగా భారత్ గెలిచిందని.. కానీ 50 ఓవర్ల వన్డేలలో మాత్రం సిరీస్ గెలవదు అన్నాడు. వర్షం పడి రెండు మ్యాచ్ లు టీమిండియా గెలిచిందని, లేకపోతే ఆ రెండు వన్డేల్లో కూడా న్యూజిలాండ్ గెలిచేదని తెలిపాడు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐకి రూ.16,600 కోట్ల లాభం?

శ‌భాష్ కావ్య‌… ఆమె దెబ్బ‌కు చెన్నై, ఢిల్లీ జ‌ట్లు స‌గం చ‌చ్చిపోయాయి

వైభ‌వ్ కార‌ణంగా య‌శ‌స్వి జైస్వాల్ ను ఓ పిచ్చికుక్కలా రాజ‌స్థాన్ చూస్తోంది!

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!

సెహ్వాగ్ లాగానే కొడుకు ఆర్యవీర్ కూడా కుంభకర్ణుడే…కదలరు, మెదలరు

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు స్కూటర్లు.. షాహిద్ అఫ్రిది బంపర్ ఆఫర్!

అంబానీకి అస‌లు బుర్ర‌లేదు…తోపుల‌ను వ‌దిలేసి, ద‌ద్ద‌మ్మ‌ల‌ను తెచ్చుకుంటున్నాడు!

Big Stories

Advertisement
×