OG 2: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కమిటైన సినిమాలను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్.. అందులో మంచి క్రేజీ నందించిన సినిమా అంటే ఓజీ.. ఈ మూవీ తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కాకుండా సొంతం చేసుకున్నాయి. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి సీక్వల్ గా ఓజీ 2 రాబోతుంది అని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ కూడా రాకపోవడంతో సినిమా ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు అభిమానులు మొదలయ్యాయి. ఇదిలా ఉండదా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది.. యాక్షన్ సన్నివేశాలతో పాటుగా.. సినిమా స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాకి సీకల్ గా ఉంటుంది అని ప్రచారం చేశారు. దాంతో ఈ సినిమా సీక్వల్ ఉంటుంది అని చిత్రం దర్శక నిర్మాతలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అని ఓ టాక్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే దీనిపై కీలక అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ లేదా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా అప్డేట్స్ గురించి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న బ్లడీ రోమియో సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాని ఎప్పుడూ రిలీజ్ చేస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. నాని ప్రస్తుతం ది పారడైజ్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
Also Read :Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. అయ్యో బాలు.. సిగ్గుపడ్డ రోహిణి..