Hyper Aadi: హైపర్ ఆది (Hyper Aadi)బుల్లితెర నవ్వుల రారాజుగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. బీటెక్ చదివి ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఆది నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో స్క్రిప్ట్ రైటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఆది అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమంలో కమెడియన్ గా, టీం లీడర్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఆది కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ కార్యక్రమం మాత్రమే కాకుండా ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈయన సందడి చేస్తూ తనదైన శైలిలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
బుగ్గలు కొరకడం.. హగ్గులు ఇవ్వడం..
ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ 20(Dhee 20) సీజన్లో కూడా ఈయన ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈయన హీరోయిన్లపై కూడా తనదైన శైలిలోనే సెటైర్లు వేశారు. గతంలో జడ్జిలుగా వచ్చిన ప్రియమణి, పూర్ణ వంటి హీరోయిన్లు బుగ్గలు కొరకడం, హగ్గులు ఇవ్వడం వంటివి నేర్పించారు అంటూ వారిపై కూడా ఈయన సెటైర్లు పేల్చారు.
పొట్టోడు..
ఇక ఈ సీజన్లో భాగంగా మరొక హీరోయిన్ రెజీనా (Regina)అలాగే కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ (Vijay Binni) మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. నటుడు నందు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ గా సౌమ్య రావు(Sowmya Rao) కూడా అడుగు పెట్టారు. ఇక ఈమె ఈ కార్యక్రమంలోకి అడుగు పెట్టిందే ఆలస్యం హైపర్ ఆది పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌమ్య రావు ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే..”ఈ షో కి అందం పెరగాలని నన్ను పెట్టేశారు.. ఈ షో మరింత హైట్ పెరగాలని యాంకర్ గా నిన్ను తీసుకున్నారు అంటూ నందుని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ షోకి కొంచెం వెయిట్ ఉండాలని ఈ పొట్టోడిని పెట్టేశారు” అంటూ హైపర్ ఆదిని ఉద్దేశించి ఈమె బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. ఈమె మాటలకు ఆది ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా “నేనుండగా నువ్వెందుకురా ఇక్కడ అంటూ సౌమ్య రావును ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటివరకు నువ్వు చేసింది మొత్తం బొక్కా.. ఇప్పుడు నేను చేసేదే కొత్త లెక్క అంటూ సౌమ్యరావు కౌంటర్ ఇవ్వగా పోవే గుంట నక్కా” అంటూ ఆది రీకౌంటర్ ఇచ్చారు. మొత్తానికి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిందని చెప్పాలి. అయితే ఇదంతా కూడా షోలో భాగంగానే జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారడంతో కొందరు మాత్రం జబర్దస్త్ లో ఆది సౌమ్యరావును తన పంచ్ డైలాగులతో బాగా ఏడిపించాడు.. ఇప్పుడు ఇలా సౌమ్యరావు తనపై రివేంజ్ తీర్చుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఈ బుక్ ఆధారంగానే గాడ్ ఆఫ్ వార్ మూవీ… రివీల్ చేసిన తారక్