Tollywood Producer: ఒకానొక సమయంలో ఒక భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అదే భాషలో మాత్రమే విడుదల అయ్యేది. ఒకవేళ ఇతర భాషలలోకి రావాలి అంటే ఆ భాషకు సంబంధించిన డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి ఇతర భాషలలోకి అనువదించి విడుదల చేసేవారు. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఓకే సినిమా వివిధ భాషలలో విడుదలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది తెలుగు ప్రొడ్యూసర్లు ఇతర భాష సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
సాధారణగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి అంటే మన తెలుగు సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేస్తూ ఆదాయ మార్గాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నిర్మాత మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం అని చెప్పాలి. ఈయన ఎక్కువగా పరభాష సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ ఉన్నారు. ఇతర భాషలకు స్పందించిన సినిమాలను తెలుగులో విడుదల చేయడమే కాకుండా ఈ డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్లను పెంచుతూ విడుదల చేయడం గమనార్గం.
ఇలా తెలుగులో విడుదలవుతున్న డబ్బింగ్ సినిమాలకు కూడా ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచడం ఎవరికి లాభదాయకమని పలువురు భావిస్తున్నారు. ఇలా డబ్బింగ్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచి మరి విడుదల చేయడం అనేది ఓ విధంగా ఆ సినిమా నిర్మాతలకు మంచి ఆదాయ మార్గాన్ని చూపించడమే అవుతుందని తద్వారా మన ఇండస్ట్రీ పరిస్థితి దయనీయంగా మారుతుందని చెప్పాలి. ఇలా తమిళ ప్రొడ్యూసర్లకు ఆదాయం మార్గాలను పెంచడానికి తెలుగు నిర్మాతలు పనిచేయడం ఎంతో విడ్డూరం అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
టాలీవుడ్ నిర్మాత తమిళ సినిమాలను పెద్ద ఎత్తున తెలుగులో విడుదల చేస్తూ ప్రమోట్ చేయడంతో పలువురు ఈయనపై సెటైర్లు పేలుస్తున్నారు. ఈయన టాలీవుడ్ నిర్మాతనా? లేకపోతే తమిళ సినిమాలకు ప్రమోటరా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ నిర్మాతకు సరైన కంటెంట్ లేకపోవడంతోనే ఇలా తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారా? లేదంటే తెలుగులో అంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు దొరకడం లేదా అంటూ కూడా ఈ నిర్మాతపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా సదరు నిర్మాత తన ధోరణి మార్చుకొని తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో సదరు నిర్మాత నిర్మాణంలో వచ్చిన తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయి.
Also Read: ఆ సినిమా చూసి రంపం వాడిన రాప్తాడు నిందుతుడు.. ఇదేం దరిద్రం రా బాబు!