E-Paper
Advertisement

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Advertisement

Telangana Rains: మురసు తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలుపడే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం లేదా రాత్రి వరకు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు

మురసు తుఫాన్ ఏపీలో తీరం ధాటిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నల్గొండ, భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షం పడింది. సత్తుపల్లి-22.8 మి.మీ, వేంసూరు-20 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

ALSO READ: గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

Advertisement

హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, బేగంపేట, హిమాయత్‌నగర్, పరిసర ప్రాంతాల్లో రాబోయే కొన్ని నిమిషాల పాటు జల్లులు పడతాయని వెల్లడించింది. సాయంత్రం వరకు కొన్ని చోట్ల అడపాదడపా జల్లులు పడవచ్చని, పెద్దగా వర్షాలు ఆశించాల్సిన అవసరం లేదని తెలిపింది.

Related News

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!

ఆ ఒక్క తప్పుతో.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం?

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!

రెవెన్యూ, ఫారెస్ట్ భూములపై కీలక నిర్ణయం.. ఏళ్ల నాటి సమస్యకు మంత్రి పొంగులేటి మాస్టర్ ప్లాన్!

జైలు గోడల మధ్య ఆటలు, పాటలు.. ఖైదీల్లో మార్పు కోసం మార్గదర్శిగా ఉల్లాసం!

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు పోల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. దంపతులు దుర్మరణం!

Big Stories

Advertisement
×