HHVM Story Copied From Bahubali: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఒక్క ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు కావాల్సిన బజ్ ని పెంచాడు ‘వీరమల్లు’. మొన్నటి వరకు ఉన్న థియేటర్ల సమస్య కూడా సద్దుమనిగింది. జూలై 24 గ్రాండ్ రిలీజ్ కు మూవీ సిద్ధమౌవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాను ప్రకటించారు. ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి రావడంతో షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
వీరమల్లు పై నెగిటివ్ ప్రచారం..
అదే సమయంలో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ తర్వాత హరి హర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నారు. స్లో స్లోగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జూలై 24న రిలీజ్ రాబోతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా వీరమల్లు స్టోరీకి సంబంధించిన ఓ లీక్ బయటకు వచ్చింది. కాగా జౌరంగ జేబు పాలనలో భారత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, బాధలను ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్స్ బాహుబలి నుంచి కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతుంది. సుమారు 20 నిమిషాలు హరి హర వీరమల్లు.. బాహుబలి చిత్రాన్ని తలపిస్తోందని అంటున్నారు. బాహుబలిలో మొదటి 20 నిమిషాలు, హరి హర వీరమల్లులోని మొదటి 20 నిమిషాలు ఉంటుందట.
బాహుబలి నుంచి కాపీ?
ఒపెనింగ్ సీన్స్ రెండు ఒకేలా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలిలో హీరో ఎంట్రీ వాటర్ ఉంటుందనే విషయం తెలిసిందే. నది ఒడ్డున ఉన్న శివలింగాన్ని.. వాటర్ ఫాల్ కింత ప్రతిష్టిస్తాడు హీరో. అంతేకాదు రాజమౌత శివగామి చిన్న పిల్లాడి నిటిలో చేయి పైకెత్తి చూపిస్తుంది. ఇక వీరమల్లులోనూ అదే వాటర్ సీన్ ఉంటుంది. అక్కడ రాజామాత శివగామి చేతిలో బిడ్డను ఎత్తి పట్టుకుంటే.. ఇక వీరమల్లులో నది తొట్టిలో బిడ్డను ఉంచినట్టు చూపిస్తారట. ఆ నది, సీన్స్ అంత సేమ్ టూ సేమ్ బాహుబలిలో ఉన్నట్టే ఉంటుందని విశ్వసనీయ సమాచారం. దీంతో హరి హర వీరమల్లు.. బాహుబలి కాపీ అంటూ విమర్శకులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదల వరకు వేయిట్ చేయాల్సిందే.
హరి హర వీరమల్లుకు కాపీ మరక..
కాగా మూవీ రిలీజ్ కు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ సమయంలో ఇలాంటి నెగిటివ్ ప్రచారం బయటకు రావడం మూవీ టీంని టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఎన్నో నెగిటివ్ కామెంట్స్, టాక్ నుంచి బయటపడ్డ చిత్ర యూనిట్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. ఇలాంటి సమయంలో వీరమల్లుపై కాపీ మరక పడటం మరో గట్టి షాక్ అనే చెప్పాలి. మరి ఈ కాపీ ప్రచారం మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో పవన్ 18వ శతాబ్ధం కాలంనాటి సమర యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. జూలై 24న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.