Hero Vishal:చిత్ర పరిశ్రమలో హీరోలు ఎలాంటి డూప్ లేకుండా.. డెడికేటెడ్ గా.. ఎంత క్లిష్టమైన సన్నివేశాలలోనైనా సరే నటిస్తూ.. ప్రాణాల మీదకు వస్తున్నా.. తెగించి మరీ ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతున్నారు. ఇలా ఎటువంటి డూప్ లేకుండా నటిస్తున్న సమయంలో అనుకోకుండా గాయాల పాలవడంతో అభిమానులను ఆందోళనలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి ఎంతోమంది హీరోలు షూటింగ్లో ప్రమాదానికి గురై.. గాయపడి ఆఖరికి శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) కూడా మరోసారి వచ్చి చేరినట్లు సమాచారం.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడుగా పేరు సొంతం చేసుకున్న విశాల్.. షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారట. దర్శకుడు సందర్ . సి (Sundar.C) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పురుషన్’ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా గోవాలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే నిన్న (సెప్టెంబర్ 17) భారీ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుండగా.. ఊహించని విధంగా విశాల్ కి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్ర బృందం ఆయనను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు గోవాలో జరుగుతున్న పురుషన్ సినిమా షూటింగ్ ను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైద్యుల సూచన మేరకు విశాల్ కొంతకాలం విశ్రాంతి తీసుకోబోతున్నారట. అయితే విశాల్ కి తగిలిన గాయం తీవ్రత ఎంతవరకు ఉంది ? ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే పురుషన్ సినిమా షూటింగ్లో హీరో విశాల్ గాయపడ్డారు అంటూ వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చిత్రబృందం ఈ విషయంపై అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే హీరో విశాల్ గతంలో కూడా ఎన్నోసార్లు సినిమాలలో యాక్షన్ సన్నివేశాలలో నటించే సమయంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
also read: భాగ్యశ్రీతో రామ్ బ్రేకప్?
పురుషన్ సినిమా విషయానికి వస్తే.. విశాల్ హీరోగా సుందర్ . సి దర్శకత్వంలో రాబోతున్న కోలీవుడ్ యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం. ఇందులో విశాల్ సరసన తమన్నా భాటియా హీరోయిన్గా నటిస్తుండగా.. యోగిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు . ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతాన్ని అందిస్తున్నారు.. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో మొగుడు పేరిట రిలీజ్ చేయబోతున్నారు.