E-Paper
Advertisement

కోలీవుడ్‌ను షేక్ చేసిన జైలర్ 2.. వెయ్యి కోట్ల లెక్క తప్పిందా?

కోలీవుడ్‌ను షేక్ చేసిన జైలర్ 2.. వెయ్యి కోట్ల లెక్క తప్పిందా?
Advertisement

Jailer 2:వెయ్యి కోట్ల క్లబ్ ..చేరాలని ఎవరికుండదు.ఒకప్పుడు వందకోట్లే కష్టమనుకున్న సినిమాలు ఇపుడు కాస్త ఈజీగానే ఈ క్లబ్ లోకి దూరిపోతున్నాయ్.ఇప్పటికే హిందీ,తెలుగు బాషల్లో పలు సినిమాలు ఈ క్లబ్ లో కూర్చున్నాయి కూడా.ఆఖరికి వంద కోట్ల కలెక్షన్స్ కూడా కష్టమే అనుకున్న కన్నడ సినీ ఇండస్ట్రీ కూడా ఈ క్లబ్ లోకి అడుగుపెట్టింది.కానీ ఎంతో హిస్టరీ ఉన్న, ఎన్నో కల్ట్ ,బ్లాక్ బస్టర్ ,బంపర్ హిట్స్ ,క్లాసిక్ సినిమాలు తీశామని చెప్పుకున్న తమిళ ఇండస్ట్రీ నుండి మాత్రం ఇప్పటికీ ఒక్క సినిమా కూడా ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.

మా లెక్క రెండు వేల కోట్లే అని కాలర్ ఎత్తిన కంగువా రిలీజ్ అయ్యాక ఎటు పోయిందో తెలీదు.ఇక భారీ అంచనాల మధ్యలో మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వన్ సిరీస్ పెట్టిన డబ్బులు రాబడితే చాలు అని అనుకున్న పరిస్థితి.ఇక విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో ఆరొందల కోట్ల దగ్గరే ఆగగా,లోకేష్ కనగరాజ్,తలైవ కాంబోలో వచ్చిన కూలీ ఊరించి ఊరించి 500 కోట్ల వద్దే ఉసూరుమనిపించిన సంగతి తెల్సిందే.ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన జైలర్ కూడా వెయ్యి కోట్ల దరిదాపుల్లోకి రాకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపించిన 600 కోట్ల జోష్ కోలీవుడ్ కి సరికొత్త ఊపిరిపోసింది.

Advertisement

ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 ని అనౌన్స్ చేయడంతో ఈ సినిమాతో అయినా కోలీవుడ్ వెయ్యికోట్ల మార్క్ ని చూడటం పక్కా అనుకున్నారంతా.అనుకున్నట్టుగానే సినిమా థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మురిసిపోయారు తమిళ తంబీలు.థియేటర్లలో ముత్తువేల్ పాండియన్ అదరగొట్టడంతో అనుకున్నట్టుగానే సినిమా ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్ లో కూర్చోవడం పక్కా అంటూ కాలర్ ఎగరేసారు.

అయితే సినిమా వాలకం చూస్తుంటే మొదట్లో ఉన్న ఆ ఊపు ఇప్పుడు తగ్గినట్టే కనిపిస్తుంది.తమిళ తంబీలు వేసుకున్న లెక్కలు తప్పినట్టే కనిపిస్తున్నాయి. అవును …జోరుగా మొదలైన బాక్సాఫీస్ కలెక్షన్స్ 750కోట్ల దగ్గరే ఆగిపోవడం,మరో వైపు వెంకీ మామ, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం, విశ్వక్ సేన్ కల్ట్ ఇంకో వైపు అలాగే మరిన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎటాక్ చేయడం వంటివి చూస్తుంటే జైలర్ 2 సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో కూర్చోవడం కష్టమేనా అన్న అనుమానం కోలీవుడ్ మూవీ లవర్స్ లో రైజ్ అవుతుంది.

Advertisement

అయితే మొదటి రోజు సినిమా ఓపెనింగ్ సాలిడ్ గానే మొదలైనా, టాక్ కాస్త మిక్స్డ్ గా రావడంతో అది క్రమంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించిందని లేకపోయుంటే ఈజీగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో కూర్చునేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా అంచనాలు పెట్టుకున్న ప్రతీ సినిమా కోలీవుడ్ కి హ్యాండ్ ఇస్తున్న ఈ సమయంలో అసలు ఏ సినిమా తమిళ తంబీల ఆశల్ని నేరవేరుస్తుందో,ఏది పుష్ప 2 ,కల్కి ,బాహుబలి ,2 , జవాన్, దంగల్, kgf 2 ల సరసన నిలుస్తుందో కాలమే డిసైడ్ చేయాలి !

ALSO READ :‘భజ గోవిందం’కి ఫిదా అవుతున్న జనాలు..సాహిత్యంతోనే సగం సినిమా హిట్ కొట్టేశారుగా!

Tags

Related News

మహిళలకు సపోర్టుగా నిలబడితే ఉద్యోగాలుండవ్ -రాధిక ఆప్టే

35 వేల అడుగుల ఎత్తులో కర్వా చౌత్ జరుపుకున్న నటి..వైరల్ అవుతున్న వీడియో!

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పేసిన సామ్ ఫ్రెండ్!

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

‘భజ గోవిందం’కి ఫిదా అవుతున్న జనాలు..సాహిత్యంతోనే సగం సినిమా హిట్ కొట్టేశారుగా!

డెలివరీ దగ్గర పడుతున్నా సమంత ఆపని వర్కౌట్స్.. వీడియో వైరల్!

‘కల్ట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ మూవీ ఎలా ఉందంటే..?

Big Stories

Advertisement
×