E-Paper
Advertisement

డెలివరీ దగ్గర పడుతున్నా సమంత ఆపని వర్కౌట్స్.. వీడియో వైరల్!

డెలివరీ దగ్గర పడుతున్నా సమంత ఆపని వర్కౌట్స్.. వీడియో వైరల్!
Advertisement

Samantha: సాధారణంగా ప్రెగ్నెన్సీ జర్నీ మొదలైన రోజు నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతి మహిళ ఎంతో జాగ్రత్తగా వైద్యుల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ.. బేబీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో ఆరోగ్యకరమైన వ్యాయామాలు, యోగ చేస్తూ ప్రెగ్నెన్సీ జర్నీని కొనసాగిస్తూ ఉంటారు. అయితే అందరికీ భిన్నంగా తొమ్మిదవ నెలలో కూడా వర్కౌట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది స్టార్ హీరోయిన్ సమంత (Samantha ). డెలివరీకి సమయం దగ్గర పడుతున్నా కూడా వర్క్ అవుట్స్ చేస్తూ షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ది ఫైనల్ ల్యాప్:

ఇకపోతే సమంత ఫిట్నెస్ కోసం చేస్తున్న వర్కౌట్స్ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి 9వ నెల వరకు తన ప్రయాణాన్ని వివరిస్తూ సమంత ఒక వీడియోని పంచుకుంది. దీనికి “#9 ది ఫైనల్ ల్యాప్” అంటూ ప్రెగ్నెన్సీ జర్నీ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇలాంటి క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న సమంతకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికైతే మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది సమంత.

Advertisement

also read: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కుకింగ్ షోలో హోస్ట్ గా..

సమంత కెరీర్ విషయానికొస్తే.. ప్రెగ్నెన్సీలో కూడా ఈమె తన వృత్తిని పక్కన పెట్టలేదు. ఒకవైపు గర్భంతో ఉంటూనే మరొకవైపు తమిళ్ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ షోలో ఆర్జే విజయ్తో కలిసి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. వెంకటేష్ భట్, శశి చెలియా, శ్రీయా అడ్కా జడ్జెస్ గా వ్యవహరిస్తున్న ఈ షో సోనీ విజూలో ప్రసారమవుతోంది. అలాగే ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.ఇక్కడ సాంప్రదాయ స్థానిక తమిళ రుచులను మరోసారి పరిచయం చేస్తున్నారు. ఇందులో వినోదరంగం తో పాటు సెలబ్రెటీలు ఈ వంటల పోటీలలో సందడి చేస్తున్నారు. మొత్తానికి అయితే సమంత హోస్టింగ్ చేస్తున్న ఈ షో కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది.

సమంత కెరియర్..

Advertisement

మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి, శుభం అనే సినిమా నిర్మించి ,మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే సినిమా చేసి ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. సమంత ఇండస్ట్రీకి దూరమైనా.. తెలుగు అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది అనడానికి ఈ సినిమా పై తెలుగు ఆడియన్స్ చూపించిన ప్రేమే నిదర్శనం అని చెప్పవచ్చు. మొత్తానికైతే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న ఈమె బాలీవుడ్ నటుడు రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసి.. ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యింది.

?utm_source=ig_web_copy_link&mdxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

‘భజ గోవిందం’కి ఫిదా అవుతున్న జనాలు..సాహిత్యంతోనే సగం సినిమా హిట్ కొట్టేశారుగా!

‘కల్ట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ మూవీ ఎలా ఉందంటే..?

‘ఆదర్శకుటుంబం’ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడిందా..?

త్రివిక్రమ్ పెన్ పవర్ గురించి థమన్ అదిరిపోయే కామెంట్స్!

ఫ్యామిలీ కథలే ఎందుకు తీస్తారు? రిపోర్టర్‌కు త్రివిక్రమ్ అదిరిపోయే కౌంటర్!

అర్జున్ రెడ్డి బ్యూటీ అందాల షో.. మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×