Rishabh Shetty:రిషబ్ శెట్టి(Rishabh Shetty).. దర్శకుడిగా, నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ‘కాంతారా’ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో కూడా సంచలనం సృష్టించారు. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా నటుడిగా, దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు.. అలాంటి ఈయన తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను, కాంతార అఫీషియల్ పేజీని అన్ ఫాలో చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా ఒక హీరో, ఒక నిర్మాణ సంస్థతో సినిమా చేశారు అంటే.. ఆ హీరోకి ఆ నిర్మాణ సంస్థతో మంచి అభినభావ సంబంధం ఏర్పడుతుంది. అలాంటిది తన కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిన సినిమా పేజినే ఇప్పుడు రిషబ్ శెట్టి అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది. దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? నిర్మాణ సంస్థతో హీరోకి విభేదాలు ఏర్పడ్డాయా? అనే అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు..
ఇకపోతే ఈ విషయంపై అటు రిషబ్ శెట్టి కానీ ఇటు హోంబలే ఫిలిమ్స్ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడంతో అనుమానాలు మరింత బలమవుతున్నాయి. కాంతార కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయిన తర్వాత తర్వాతి పార్ట్ కోసం ప్రేక్షకులు ఏందో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం అటు అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
ఇకపోతే ఒకవైపు ఇలా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. సెలబ్రిటీలు అప్పుడప్పుడు సెక్యూరిటీ కోసం తమ సోషల్ మీడియా ఖాతాలను క్లీన్ చేస్తూ ఉంటారు. అనవసరమైన పేజీలను అన్ ఫాలో చేస్తారు.. అంతమాత్రాన వారితో విభేదాలు ఉంటాయా ? నిజానిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా తన సొంత సినిమా పేజీని అన్ ఫాలో చేయడం మాత్రం చిన్న విషయమే కాదని చాలామంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కాంతార చాప్టర్ వన్ తర్వాత వచ్చే తదుపరి చిత్రంపై ఈ ప్రభావం భారీగా పడుతుందనే కామెంట్లు మాత్రం వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Dhurandhar 2: ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రికార్డ్స్ బ్రేక్ చేసిందా?
కాంతార సినిమా విషయానికి వస్తే.. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని రికార్డులు సొంతం చేసుకుని.. ఇక ఈ సినిమా కొనసాగింపుగా కాంతార చాప్టర్ వన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతకుమించి విజయం సొంతం చేసుకుంది..అటు టీవీలలో ఇటు ఓటిటిలో మంచి రేటింగు సొంతం చేసుకొని దూసుకుపోతోంది.. ఇప్పటికీ కూడా టీవీలలో ఈ సినిమాకి ఆదరణ విపరీతంగా ఉంది. అలాంటిది ఇప్పుడు చిత్ర నిర్మాతకి హీరోకి మధ్య విభేదాలు ఉన్నాయ్ అంటూ వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.