E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రికార్డ్స్ బ్రేక్ చేసిందా?

Dhurandhar 2: ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రికార్డ్స్ బ్రేక్ చేసిందా?
Advertisement

Dhurandhar 2:రణ్ వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా ఆదిత్యధర్(Adithya Dhar) దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం ధురంధర్.. ఏకంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమాకి.. ఉగాది పర్వదినాన సీక్వెల్ గా ‘ధురంధర్ : ది రివేంజ్’ పేరిట రిలీజ్ చేశారు. అయితే మొదట తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పినా.. కొన్ని అనివార్య కారణాలవల్ల చివరి నిమిషంలో షోలు క్యాన్సిల్ అయ్యాయి.. దీంతో హిందీలో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది.

ఒక్కో టికెట్ ధర రూ.3100 పై మాటే!

ఇకపోతే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలలో 3100కి పైగా టికెట్ ధర నిర్ణయించినప్పటికీ హౌస్ ఫుల్ షోలు పడడమే కాకుండా టికెట్లు కూడా దొరకని వైనం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కచ్చితంగా 250 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్ వసూలు చేసింది? ఆ చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసిందా? లేదా? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్..

Advertisement

బాలీవుడ్ లో మాత్రమే విడుదలైన ఈ సినిమా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ధురంధర్ 2 సినిమా ప్రీమియర్స్ , ఫస్ట్ డే కలిపి సుమారుగా 172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.. కేవలం ప్రీమియర్స్ నుంచే 43 కోట్లకు పైగా గ్రాస్ దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా మొదటిరోజు సుమారుగా 145 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం. ఇకపోతే ధురంధర్ 2 సినిమాకి దేశవ్యాప్తంగా సుమారుగా 33 వేల షోలకు పైగా పడ్డాయి. హిందీలోనే ఈ సినిమా 102కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇకపోతే ఈ కలెక్షన్ల గురించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ALSO READ:Geetha Singh: స్టార్ డైరెక్టర్లే అవమానించారు.. ఆ ఆవేదన తప్పలేదంటున్న గీతా సింగ్!

పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ అసాధ్యమేనా?

Advertisement

ఇకపోతే ఇండియాలో మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో పుష్ప 2 సినిమా 294 కోట్లతో టాప్ లో నిలిచింది.. ఆ తర్వాత స్థానాలలో ఆర్ ఆర్ ఆర్, బాహుబలి, కల్కి సినిమాలు నిలిచాయి.

తొలి హిందీ సినిమాగా రికార్డ్!

ఫస్ట్ డేలోనే రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఇందులో హిందీ వెర్షన్ నుంచే రూ.103 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఈ రికార్డులతో ‘జవాన్’, ‘పఠాన్’, ‘యానిమల్’ వంటి బిగ్గెస్ట్ ఓపెనర్స్‌ను ఈ సినిమా దాటేసింది. అలాగే ఆల్ ఇండియా స్థాయిలో ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాల ఫస్ట్ డే రికార్డులను కూడా అధిగమించింది. అన్ని భాషల్లో కలిపి చూస్తే ‘పుష్ప 2’ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అన్ని ప్రాంతాల్లో రెగ్యులర్ షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ స్పై డ్రామాలో ర‌ణ్‌వీర్ సింగ్‌ ఎనర్జీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటుల నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది. మొదటి భాగం భారీగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ కూడా అదే స్థాయిని దాటి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరికొన్ని రోజులు సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×