Rajendra Prasad: “నటకిరీటి” గా పేరు సొంతం చేసుకున్నారు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ తన అద్భుతమైన నటనతో అందరిని అబ్బురపరుస్తున్నారు. ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలు చేసిన ఈయన.. లేడీ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇక ఈ మధ్య ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తున్న ఈయన.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రాజేంద్రప్రసాద్ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. రాజేంద్రప్రసాద్ కి కొడుకు ఉండి కూడా ఎందుకు ఆయనను ఇండస్ట్రీకి తీసుకురాలేదు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
40 ఏళ్ల సినీ ప్రస్థానంలో కొడుకును హీరోగా చేయలేకపోయిన రాజేంద్రప్రసాద్..
40 ఏళ్ల సినీ ప్రస్థానంలో స్టార్ హీరోగా చక్రం తిప్పిన రాజేంద్రప్రసాద్.. తన కొడుకు బాలాజీ ప్రసాద్ (Balaji Prasad) ను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఎందుకు తన వారసుడిని హీరో చేయలేకపోయాడు అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే దీని వెనుక ఒక పెద్ద కథ కూడా ఉందని సమాచారం. సాధారణంగా ఒక హీరో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తమ వారసులకు కూడా అదే దారిలోనే స్టార్ స్టేటస్ అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందరి తండ్రులు లాగానే రాజేంద్రప్రసాద్ కూడా తన బాటలోనే తన కొడుకును కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు కొడుకు కూడా అచ్చం రాజేంద్రప్రసాద్ లాగే ఉండడంతో చాలామంది హీరోగా పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ ను కోరాడట. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు రాజేంద్రప్రసాద్.
అందుకే దూరం అంటున్న బాలాజీ ప్రసాద్..
ఇక అందులో భాగంగానే అందరూ దొంగలే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా వంటి కామెడీ చిత్రాలతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న నిధి ప్రసాద్ (Nidhi Prasad) దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నారు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. అయితే షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక తిరిగి ప్రారంభమవుతుంది అనుకున్న షూటింగు ప్రారంభం కాకపోయేసరికి బాలాజీ ప్రసాద్ మనసు చిన్నబోయిందని సమాచారం. మొదటి సినిమా విషయంలోనే ఇన్ని కష్టాలు ఎదుర్కోవడంతో ఆయన తట్టుకోలేకపోయారట. అందుకే నటన అంటేనే విసుగు తెచ్చుకున్నాడని ఆయన సన్నిహితులు కూడా చెబుతూ ఉంటారు.
రాజేంద్ర ప్రసాద్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?
ఇక రాజేంద్రప్రసాద్ ఈ విషయంలో తన కొడుకును ఎంత ఒప్పించాలని ప్రయత్నం చేసినా.. బాలాజీ ప్రసాద్ మాత్రం తన తండ్రి మాటను వినలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలాజీ ప్రసాద్ తనకు ఇష్టమైన విదేశాలకు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే జీవితంలో ఎంత సాధించినా తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాను అనే బాధ ఆయనలో ఎప్పటికీ ఉండిపోయింది అనేది వాస్తవం. ఏది ఏమైనా ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తన కొడుకును మాత్రం ఇండస్ట్రీకి తీసుకురాలేకపోయారు ఇంకా దీనికి తోడు ఇటీవల కూతురు మరణం ఆయనను మనిషిని చేయలేకపోయిందని సన్నిహితులు చెబుతూ ఉంటారు.
also read:Sonu Sood: వామ్మో.. ఒంటి చేత్తో భలే పట్టేసాడే.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో!