Hyderabad News: హైదరాబాద్ మియాపూర్ ఓ పాఠశాలలో దారుణం జరిగింది. ఓ స్కూల్ బిల్డింగ్‌పై నుంచి కిందపడి విద్యార్థి మృతి చెందాడు. మృతుడు పదో తరగతి చదువుతున్నాయి. స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. విద్యార్థి కుటుంబసభ్యులకు తెలియగానే షాకయ్యారు.
మియాపూర్‌లోని మధురానగర్ ఏరియాలో సెయింట్ మార్టిన్ పాఠశాల ఉంది. అందులో పదో తరగతి చదువుతున్నాడు షేక్ రిజ్వాన్. సమయం, సందర్భం ఇంకా తెలీదు. కాకపోతే పాఠశాల భవనం ఐదో అంతస్తుకు వెళ్లిన రిజ్వాన్, అక్కడి నుంచి కిందకు దూకాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో హాస్పటల్‌కి పాఠశాల సిబ్బంది తరలించారు.
అదే సమయంలో విద్యార్థి పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. కొడుకు మృతితో రిజ్వాన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు.
విద్యార్థులతో గొడవపడి కిందకు పడ్డాడా? లేకపోతే పందెం కాసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడా? కావాలనే ఎవరైనా భవనం పైనుంచి కిందకు తోసివేశారా? అనేది తెలియాల్సివుంది. పాఠశాలలో సీసీటీవీ పుటేజ్‌ని పరిశీలించారు. రిజ్వాన్ చదువుతున్న క్లాస్‌లో కొందర్ని పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: దారుణం పడవ బోల్తాపడి 28 మంది మృతి