Sonu Sood:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా వైల్డ్ లైఫ్ అనుభవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్ సదా (Sada) వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారగా.. ఇప్పుడు ప్రముఖ హీరో సోనూసూద్ (Sonu sood) కూడా ఒక పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈయన నిజంగానే రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి సోనూ సూద్ ఏం చేశారు? ఆ వీడియోలో ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
స్నేక్ క్యాచర్ గా మారిన సోనుసూద్..
సోనూ సూద్ కి సంబంధించిన ఆ వీడియోని బట్టి చూస్తే ప్రస్తుతం ఆయన స్నేక్ క్యాచర్ గా మారిపోయారు. ముంబైలో తాను నివసించే సొసైటీలోకి ఒక పాము ప్రవేశించడంతో.. అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీంతో రంగంలోకి దిగిన సోనూ సూద్ జాగ్రత్తగా ఒంటి చేత్తో ఆ పామును పట్టుకొని సంచిలో వేసి బంధించారు. అంతేకాదు దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేసి రావాలి అని తన వద్ద పనిచేసే యువకులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను సోనూ సూద్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా.. ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. అటు ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో లక్షలాది వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది ఈ వీడియో. ప్రజలకు హాని కలగకుండా అటు ధైర్యాన్ని ప్రదర్శించిన ఈయన.. అటు వన్య ప్రాణులపై ప్రేమను చూపించి, వాటిని సురక్షితంగా వదిలేయమని చెప్పడంతో కూడా నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అని, అసలైన రియల్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండడం గమనార్హం.
ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డు అందుకున్న సోనూ సూద్..
ఇదిలా ఉండగా తన గొప్ప మనసుతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈయన.. కరోనా సమయంలో ఈయన చేసిన సేవలకు గానూ.. ఇటీవల ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ వేడుక సందర్భంగా.. సోనూసూద్ కి ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డు అందించారు. కోవిడ్ సమయంలో వలస కార్మికులకు, విద్యార్థులకు, పేద కుటుంబాలకు అండగా నిలిచారు. కోట్లాది రూపాయలను సహాయం చేసి, ఆర్థికంగా ఆదుకున్నారు. ఆరోగ్యం, ఆహారం, సంరక్షణ, నిరుపేదల సాధికారతపై ప్రస్తుతం పని చేస్తున్నారు. అంతేకాదు సూద్ చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.
పేద మహిళలకు అండగా..
అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న ఈయన.. పేద మహిళలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇక సూద్ ఫౌండేషన్ సేవల గుర్తించిన హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐదేళ్లపాటు విదేశీ సహకార నియంత్రణ చట్టం లైసెన్స్ ను అందించింది. ఈ నేపథ్యంలోనే ఈ చారిటీ ఫౌండేషన్ తో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ బ్యూటీ విత్ ఏ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపి రెండు సంస్థలు క్యాన్సర్ పై అవగాహన కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి అయితే సోను సూద్ గొప్ప మనసు పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read:HHVM Making Video: ఆకట్టుకుంటున్న హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో.. కష్టానికి ప్రతిఫలం లభిస్తుందా?
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==