The Paradise : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ హెడ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటిస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తున్నాయి. ఈ ఏడది నాని నటించిన హిట్ 3 మూవీ రిలీజ్ అయ్యింది.. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ వర్షం కూడా కురిపించింది.. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ది ప్యారడైజ్ మూవీ రాబోతుంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. అయితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ కావాల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నాని నటిస్తున్న ప్యారడైజ్ మూవీ ఆగస్టు నెలలో విడుదల కావాల్సి ఉంది.. అయితే ఈ సినిమా షూటింగు ఇంకా పెండింగ్ ఉండడంతో విడుదల వాయిదా పడింది.. త్వరగా సినిమాను పూర్తి చేసి థియేటర్లోకి తీసుకురావాలని అభిమానులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా సరే.. శ్రీకాంత్ ఓదెలా మాత్రం ఆ సినిమాని రాజమౌళి కంటే ఎక్కువగానే చెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దాదాపు రెండు, మూడు వారాల వరకు ఈ సినిమా షూటింగ్ జరగనున్నంత సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్ పూర్తి చేసి, మళ్లీ ప్రమోషన్స్ మొదలు పెట్టాలంటే ఇంకా సమయం పట్టేలా ఉంది అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రమోషన్ కి పెద్దగా టైం లేదని తెలుస్తుంది. మరి దీనిపై నాని అలాగే డైరెక్టర్ ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో చూడాలి..
నాని సినిమాలను జనాలు ఎప్పుడు చూద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో నాని నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఆ కౌంబోలో మరోసారి భారీ యాక్షన్ చిత్రం రాబోతుంది.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో బిజీగా ఉంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ పై జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో పాటుగా విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..
Also Read :‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?