Varanasi Movie : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో స్టోరీ ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు మహేష్ అభిమానులతో పాటుగా సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండదా రాజమౌళి సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్కెక్కించిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక ప్రత్యేకత తో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. వారణాసిలో కూడా అలాంటి వాటిని ఉపయోగిస్తారా అంటూ అభిమానులు గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. దానిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అర్థమవుతుంది. అసలు ఈ మూవీ గురించి బయటికి వచ్చిన వార్త ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఎలాంటి ప్రత్యేకతలు కనిపిస్తాయి. అసలు రాజమౌళి ఈసారి ఎలాంటి లోకానికి తీసుకొని వెళ్తాడు అని జనాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో రాజమౌళి సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంటాయి. అయితే రాజమౌళి గ్రాఫిక్స్ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా అభిమానుల్లో వినిపిస్తున్నాయి. కానీ వారణాసి సినిమాకు మాత్రం ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఎక్కడ వినియోగించలేదు అంటూ ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ఏఐ వాయిస్, లేదా కంప్యూటర్ వాయిస్ లను ఎట్టిపరిస్థితులు ఉపయోగించకూడదు అని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 1500 మంది వాయిస్ ఆర్టిస్టులకు భారీ స్థాయిలో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. కొద్ది మంది ప్రముఖులకే పరిమితం కాకుండా విభిన్న గళాలు కలిగిన ప్రతిభావంతులను బయటకు తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం అని తెలుస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు..
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సినీ అభిమానులతో పాటుగా.. ఫ్యాన్ ఇండియా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మూవీ ని చూసేందుకు జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారణాసి మూవీలో రాముడి పాత్రలో మహేష్ బాబు కనిపించడంతో జనాలు మహేష్ బాబుని స్క్రీన్ మీద ఎప్పుడు ఎప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో, బాలీవుడ్, బాలీవుడ్ లోని ప్రముఖ స్టార్లతో పాటు మరికొంతమంది పనిచేయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను కైవసం చేసుకుంటుంది అన్నది చూడాలి..
Also Read : నర్మదా పోస్ట్ ఎవరికోసం..ఎక్కడో తేడా కొడుతుంది సీనా..