Vishwak Sen Remuneration:విశ్వక్ సేన్..హీరోగానే కాకుండా డైరెక్టర్ గానూ తనదైన మార్క్ చూపించే పనిలో పడ్డాడు .అలా తొలిసారి కల్ట్ అనే సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకతం చేస్తున్నాడు. దీంతో అసలు విశ్వక్ సీన్ ఈ డ్యూయల్ రోల్ కి అసలెంత పారితోషికం పుచ్చుకుంటున్నాడు అంటూ క్యూరియస్ గా ఆరా తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్ .
విశ్వక్ సేన్ కెరీర్ విషయానికి వస్తే హీరోగా 2017లో ‘వెళ్లిపోమాకే’తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నాగతి తెల్సిందే.. ఆ తర్వాత వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’తో మాత్రం విశ్వక్ కెరీర్ ని మలువు తిప్పేసింది .దర్శకత్వం వహిస్తూనే సినిమాలో నటించిన విశ్వక్ అటు ఆడియన్స్ లో ఇటు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు .
ఫలక్‌నుమా దాస్’తో మొదలైన మరో ప్రయాణం
‘ఫలక్‌నుమా దాస్’ విశ్వక్ సేన్ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా. 2019లో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాకు విశ్వక్ దర్శకత్వం వహించడమే కాదు . కథను కూడా తనే రాసుకోవడం విశేషం.
అయితే ఆ సినిమా తర్వాత నటుడిగానే ఎక్కువ సినిమాలు చేసుకుపోయాడు .అలా వచ్చాడు. ‘హిట్’లో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజుగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘పాగల్’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ వంటి సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి మెప్పించాడు .వీటిలో చివరి నాలుగు సినిమాలు సో సో గానే ఆడినప్పటికీ తనదైన మార్క్ చూపెట్టడం విశేషం,ముఖ్యంగా ‘గామి’ సినిమా విశ్వక్ కెరీర్ లో ఒక క్రేజీ ఫిలిం అని చెప్పాలి.
మళ్లీ డైరెక్షన్‌లోకి ‘దాస్ కా ధమ్కీ’
అయితే విశ్వక్ సేన్ ఫలక్ నామ దాస్ తోనే ఆగిపోకుండా ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టాడు. 2023లో వచ్చిన ఈ సినిమాలో హీరోగా డ్యూయల్ రోల్ చేయడంతో పాటు దర్శకుడు, రచయిత, నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.ఒకరకంగా ఈ విషయంలోనే విశ్వక్ సేన్ మిగతా హీరోల కంటే కాస్త స్పెషల్ అని చెప్పాలి.
ఇక ఈ ఏడు ఫంకీ సినిమాతో బోల్తా కొట్టినప్పటికీ చేతిలో ఈ నగరానికి ఏమైంది 2,లెగసీ ,సినిమాలతో పాట సొంత దర్శకత్వంలోనే కల్ట్ అనే మరో సినిమా ఉండటం విశేషం.
ఏకంగా 12 నుండి 15 కోట్ల మధ్యలో
ఇక పారితోషికం విషయానికి వస్తే హీరోగా 5 నుండి పది కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట,మరో వైపు తన సొంత దర్శకత్వంలో వస్తున్న కల్ట్ అనే సినిమా కోసం ఏకంగా 12 నుండి 15 కోట్ల మధ్యలో వెనకేస్తున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తుంది .ఇక ఈ సినిమా గనుక హిట్ అయితే విశ్వక్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. చూడాలి మరి మిగతా హీరోల కన్నా మెగా ఫోన్ తో ఒక మెట్టు ఎక్కువే ఉన్న ఈ కుర్ర హీరో రాబోయే రోజుల్లో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడో !
also read:పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?