Mohammad Yousuf On IND VS PAK: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ( Asian Games 2026 Tournament Final) సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా టీమిండియా, పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టీమిండియా గోల్డ్ మెడల్ దక్కించుకొని చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో వరుసగా ఓడిపోవడానికి సిగ్గుగా లేదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలోనే సీన్ లోకి మహమ్మద్ యూసఫ్ కూడా వచ్చాడు. నాలుగు సంవత్సరాలుగా ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా పై గెలవలేక పోతున్నామని… ఇంతకన్నా దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును చూసి తల తెగినట్టుగా ఉందని బాంబు పేల్చారు. పాకిస్తాన్ క్రికెట్ అంతమయ్యే పరిస్థితి వచ్చిందని హెచ్చరించారు. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026 Tournament Final) నేపథ్యంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ తుక్కు, తుక్కుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు టీమిండియా పై పాకిస్తాన్ ప్రతిసారి గెలిచేదని.. గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఫైర్ అయ్యారు. గత నాలుగు సంవత్సరాలకు పైగా ఇండియా పై ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేకపోవడం దుర్మార్గమన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జట్టుగా టీమిండియా ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. కానీ పాకిస్తాన్ మాత్రం అంతమయ్యే పరిస్థితికి వచ్చిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పాకిస్తాన్ క్రికెట్ ను కాపాడటం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) మొద్దు నిద్ర లేవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ కుర్రాలను… వెతకాలని సూచించారు. అప్పుడు హసన్ నవాజ్ లాంటి కుర్రాళ్లు దొరుకుతారని తెలిపారు. దాని కోసం ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బతుకుతుందని సూచనలు చేశారు. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.