Bigg Boss 9 Promo: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీలో 19వ సీజన్ ప్రారంభం అవ్వగా.. అటు తమిళ్ , కన్నడ భాషల్లో కూడా ఈ షో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తెలుగు విషయానికొస్తే.. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభమైంది. అలా మొత్తం ఈ హౌస్ లోకి 9 మంది సెలబ్రిటీలు.. 6 మంది కామనర్స్ అడుగుపెట్టారు. మొదటివారం అనూహ్యంగా జానీ మాస్టర్ శిష్యురాలు లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti varma) ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కామనర్ మర్యాద మనీష్ (Maryada Manish) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈరోజు రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రోమో రిలీజ్..
ఇదిలా ఉండగా.. తాజాగా 14వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటాపోటీ గట్టిగానే సాగింది. నిజానికి డెమోన్ పవన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. అతడు చేసిన పని వల్ల నాగార్జున పవన్ కెప్టెన్సీని తొలగించారు. కానీ మళ్ళీ టాస్క్ నిర్వహించడంతో ఆ టాస్క్ లో పవన్ కే కెప్టెన్సీ బాధ్యతలు అందించినట్లు సమాచారం. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరు? అని అడగగా కంటెస్టెంట్స్ చాలామంది ఫ్లోరా షైనీ(Flora Saini) ను టార్గెట్ చేయడం ఇక్కడ వైరల్ గా మారింది.
ALSO READ:Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
మోస్ట్ బోరింగ్ పర్సన్ గా సెలబ్రిటీ..
మొదట కామనర్ హరిత హరీష్ మాట్లాడుతూ.. ఫ్లోరాను సెలెక్ట్ చేసి ఆమె చాలా స్వీట్ అండ్ క్యూట్ పర్సన్.. కానీ అందరితో పెద్దగా కలవరు అంటూ ఆమె బోరింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సంజన, దమ్ము శ్రీజ, కళ్యాణ్ ఇలా చాలామంది ఫ్లోరా షైనీని బోరింగ్ అంటూ తెలిపారు. ఆ తర్వాత తనుజా వచ్చి హరిత హరీష్ బోరింగ్ పర్సన్ అంటూ తెలిపారు. ఇక మళ్ళీ సుమన్ శెట్టి ఫ్లోరా షైనీని బోరింగ్ అంటూ ఆమెకు హిందీ వచ్చు నాకు హిందీ రాదు అని తెలిపారు. అలా మొత్తానికైతే ఈవారం మోస్ట్ బోరింగ్ పర్సన్ గా ఫ్లోరా నిలిచింది. అందరూ కలిసి ఆమెను కట్టకట్టుకొని మరి బోరింగ్ పర్సన్ చేసేశారు.. పాపం నువ్వైనా కాస్త వారిలో కలువమ్మా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది. చివరిగా ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు నాగార్జున. నామినేషన్స్ లో ఉన్న వారికి స్పీకింగ్ కాక్టస్ ఇచ్చి నేను సేఫ్ యేనా అని అడగమని చెబుతారు. అయితే అందరూ అడగ్గా ఆ కాక్టస్ ఏం చెప్పింది అనే విషయాన్ని సస్పెన్స్ లో వదిలేశారు.