Khammam Murder: గతేడాది అక్టోబర్ 31.. ఖమ్మం జిల్లా పాతర్లపాడు ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉన్న పశువుల కొట్టంలో నిద్రపోతున్న 72 ఏళ్ల సామినేని రామారావును ఎవరో కిరాతకంగా నరికి చంపేశారు. కానీ కిల్లర్స్ ఎవరు? అంతుచిక్కలేదు. కేసు కదలదు.. క్లూ దొరకదు.. టైమ్ మాత్రం గడుస్తోంది. అయినా ఖమ్మం పోలీసులు వదల్లేదు. స్పెషల్ టీమ్స్.. టెక్నికల్ టీమ్స్.. ఫోరెన్సిక్ టీమ్స్.. ఆహర్నిశలు శ్రమించారు. స్పాట్‌లో దొరికిన చెప్పులు, కాలిముద్రలు, బట్టల ముక్కలు, కత్తి కవర్లు దేన్ని కూడా లైట్‌గా తీసుకోలేదు.
దర్యాప్తులో స్పీడ్..
గుజరాత్‌లోని గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎక్స్‌పర్ట్స్ చేతిలో డీప్ అనాలిసిస్ జరిగింది. సైంటిఫిక్ అనాలిసిస్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ బేస్ చేసుకుని మాస్టర్ ప్లాన్‌తో దర్యాప్తులో స్పీడ్ పెంచారు. ఫైనల్‌గా తెల్దారుపల్లికి చెందిన మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కార్లపుడి ఉదయ్‌కుమార్ ఈ హత్యలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసి అరెస్ట్ చేశారు.
బెయిల్ వచ్చింది కానీ.. బుద్ధి రాలేదు..
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ కేసులో అరెస్టయిన నలుగురు కిల్లర్స్‌కు పక్కా క్రైమ్ హిస్టరీ ఉంది. అందులో ముగ్గురు.. 2022 ఆగస్టు 15న జరిగిన తమ్మినేని కృష్ణయ్య మర్డర్ కేసులో కూడా నిందితులే.. బెయిల్‌పై బయట తిరుగుతూ.. మళ్లీ మరో మర్డర్ చేశారు. వీళ్లకు బెయిల్ అయితే వచ్చిందికానీ బుద్ది మాత్రం రాలేదన్నమాట.
మరో కొత్త ప్రశ్న తెర పైకి..
ఏడాది పాటు చీకట్లో ఉన్న హత్య మిస్టరీకి పోలీసులు సమాధానం చెప్పారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అసలు హంతకులను వదిలేశారని ఆరోపణలు చేయడంతో మరో కొత్త ప్రశ్నను తెరపైకి తెచ్చాయి. ఈ కేసులో అసలు నిజం కోర్టు విచారణలో తేలాల్సిందే!
Also Read: చంద్రబాబుకి పబ్లిక్ స్టంట్లు తప్ప వరద బాధితులపై పట్టింపు లేదు: బొత్స సత్యనారాయణ