E-Paper
Advertisement

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!
Advertisement

Jailer 2 OTT:సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. రజినీ మాస్ యాక్షన్, నెల్సన్ స్టైల్ కామెడీ, అనిరుధ్ మ్యూజిక్ కలిసి సినిమాను బ్లాక్‌బస్టర్ చేశాయి. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ‘జైలర్ 2’ వస్తుండటంతో  మురిసిపోతున్నారు తలైవా ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ విషయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘జైలర్ 2’ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి  అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

‘జైలర్’ కంటే రూ.60 కోట్లు ఎక్కువ!

Advertisement

ఇక ‘జైలర్’ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు రూ.100 కోట్లకు అమ్ముడైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇప్పుడు ‘జైలర్ 2’కు ఏకంగా రూ.160 కోట్ల డీల్ కుదిరిందనే టాక్ రావడం చూస్తుంటే.. ఈ సీక్వెల్‌పై స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఎంతటి గురి ఉందో అర్థమవుతుంది.అంటే మొదటి పార్ట్‌తో పోలిస్తే సీక్వెల్ డిజిటల్ మార్కెట్ దాదాపు రూ.60 కోట్లు పెరిగిందన్నమాట.

‘జైలర్’తో రజినీ మాస్ రేంజ్ ఏంటో చూపించాడు

ఇక ‘జైలర్’ విషయానికి వస్తే.. ఈ సినిమా 2023 ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చి రజినీకాంత్ కెరీర్‌లోనే గుర్తుండిపోయే హిట్లలో ఒకటిగా నిలిచింది.టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీ చేసిన యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా తలైవా ఎంట్రీ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.

ఈసారి ఇంకా పెద్ద మాస్ ట్రీట్ ఉంటుందా?

Advertisement

ఇప్పుడు ‘జైలర్ 2’లో కూడా ముత్తువేల్ పాండ్యన్ పాత్రలోనే రజినీకాంత్ కనిపించబోతున్నారు.అయితే ఈసారి కథ ఏంటి? మొదటి పార్ట్ కంటే పెద్దగా ఏం చూపించబోతున్నారు? అనేది ఆసక్తిగా మారింది.సీక్వెల్ కావడంతో యాక్షన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌ను మరింత పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.

స్టార్ కాస్ట్ కూడా అదిరిపోయేలా ఉంది!

ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మొదటి ‘జైలర్’లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లు గెస్ట్ అప్పియరెన్స్‌తో అదరగొట్టారు. దీంతో రెండో పార్ట్‌లో కూడా అలాంటి సర్‌ప్రైజ్‌లు ఉంటాయా? అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది.

మరోసారి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15, 2026న థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది.

అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే!

మొత్తానికి.. ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్త ఇప్పుడు సినిమాకు మరింత హైప్ తెచ్చింది. అధికారికంగా డీల్‌పై క్లారిటీ రావాల్సి ఉన్నా.. ఈ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోందనే టాక్ మాత్రం రజినీ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చూపిస్తోంది.

also read:రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత ‘జైలర్ 2’ మొదటి పార్ట్‌ను మించి రికార్డులు కొడుతుందా? బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేస్తుందా? అనేది తెలియాలంటే అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే!

Tags

Related News

స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

Big Stories

Advertisement
×