Tejaswi Madivada:సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజస్వి మదివాడ.. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించినా పెద్దగా ఎవరికీ గుర్తుండిపోయే స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’ మాత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మరో మలుపు తిప్పిందనే చెప్పాలి.
2014 జూలై 12న విడుదలైన ఈ సినిమా కంటే ముందే తేజస్వి పేరు ఇండస్ట్రీలో వినిపించినా.. ‘ఐస్‌క్రీమ్’ తర్వాత మాత్రం ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది.అయితే ఈ గుర్తింపు ఆమెకు ఎంత ప్లస్ అయిందో.. అంతే మైనస్ అయిందంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తేజస్వి మొదట ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కనిపించింది. 2013లో వచ్చిన ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా.. పక్కింటి అమ్మాయి తరహా లుక్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఇక ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ వంటి సినిమాల్లో కూడా కనిపించింది.
ఇక అలా వరుస సినిమాలు చేస్తున్న తేజస్వికి రామ్ గోపాల్ వర్మ సినిమా ‘ఐస్‌క్రీమ్’ ఒక్కసారిగా మలుపు తిప్పేసింది.నవదీప్ హీరోగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో తేజస్వి ప్రధాన పాత్రలో కనిపించింది. వర్మ స్టైల్‌కు తగ్గట్టుగా సినిమా షూటింగ్ కూడా చాలా భిన్నంగా జరిగిందని ఆమె అప్పట్లో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాతోనే తెలుగులో గింబల్ వాడకం మొదలవడం విశేషం.
అయితే సినిమా విడుదలకు ముందు ‘ఐస్‌క్రీమ్’ చుట్టూ ఏర్పడిన వివాదం తేజస్విని ఒక్కసారిగా వార్తల్లోకి తీసుకొచ్చింది.సినిమాలో ఆమె న్యూడ్ సీన్ చేసిందంటూ అప్పట్లో భారీగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, కథనాలు కూడా వైరల్ కావడంతో తేజస్వి పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.
అయితే తర్వాత ఆమె స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. సినిమాలో తాను నిజంగా న్యూడ్‌గా కనిపించే సీన్ లేదని, ప్రచారం జరిగిన విధానం వేరేలా ఉందని వివరించింది.‘ఐస్‌క్రీమ్’ వల్ల తనపై ఏర్పడిన ఇమేజ్ నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ‘ఐస్‌క్రీమ్’తో ఒక్కసారిగా గుర్తింపు వచ్చినా.. తనపై ఏర్పడిన ఇమేజ్ కారణంగా మంచి అవకాశాలు దూరమయ్యాయని తేజస్వి మనసులోని మాటలను బయటపెట్టింది.
ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉన్నా.. ఈ సినిమా తర్వాత తనను చూసే విధానం మారిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది.ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు చూసే సినిమాల్లో కనిపించిన తేజస్వి.. ఒక్కసారిగా బోల్డ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్‌గా ముద్ర పడటం తన కెరీర్‌కు ఇబ్బందిగా మారిందనే భావన ఆమె మాటల్లో కనిపించింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తేజస్వి చెప్పిన ప్రకారం ‘ఐస్‌క్రీమ్’ తర్వాత మంచి ప్రొడ్యూసర్లు, మంచి అవకాశాలు రావాల్సింది పోయి.. తనకు అవసరం లేని రీతిలో కొందరి నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైందట.తాను ఆశించిన కెరీర్‌కి బదులుగా పూర్తిగా వేరే రకమైన ఆఫర్లు, పరిచయాలు రావడం తనను ఇబ్బంది పెట్టిందనే భావనను ఆమె ఇంటర్వ్యూల్లో వ్యక్తం చేసింది.
అయితే తేజస్వి మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ‘ఐస్‌క్రీమ్’ తర్వాత రామ్ గోపాల్ వర్మతోనే ‘అనుక్షణం’లో కూడా నటించింది.ఆ తర్వాత ‘లవర్స్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘శ్రీమంతుడు’, ‘పండగ చేస్కో’ వంటి సినిమాల్లో కనిపించింది.
‘కెరింత’ సినిమాలో చేసిన పాత్రకు కూడా ఆమెకు మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా తనకు ‘కెరింత’ మంచి గుర్తింపు తెచ్చిందని గతంలోనే తెలిపింది.
also read:ఈ వీకెండ్ సినిమాల జాతర.. బరిలో ఉన్నవి ఇవే!
మొత్తంగా చూస్తే తేజస్వి కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే ‘ఐస్‌క్రీమ్’ ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.ఒకవైపు హీరోయిన్‌గా ఆమెకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. మరోవైపు అదే సినిమాతో వచ్చిన బోల్డ్ ఇమేజ్ తర్వాతి అవకాశాలపై ప్రభావం చూపిందని ఆమె స్వయంగా చెప్పడం ఆసక్తికరం.