E-Paper
Advertisement

ఐపీఎల్ లో వ‌దిలేయ్‌..వెంట‌నే పాకిస్తాన్ కు వ‌చ్చేయ్‌..పాండ్యాకు బంప‌ర్ ఆఫ‌ర్ !

ఐపీఎల్ లో వ‌దిలేయ్‌..వెంట‌నే పాకిస్తాన్ కు వ‌చ్చేయ్‌..పాండ్యాకు బంప‌ర్ ఆఫ‌ర్ !
Advertisement

Shahid Afridi Bumper Offer To Hardik Pandya:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఏ జట్టులోకి వెళ్లే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి అతడు తప్పుకుంటున్నాడని వార్తలు బయటకు రాగానే.. మిగిలిన 9 ఫ్రాంచైజీలు అతని కోసం ఎగబడుతున్నాయి. హార్దిక్ పాండ్యా తమకు కావాలంటే.. తమకు కావాలి అంటూ, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెంట్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లు హార్దిక్ పాండ్యాతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అటు గుజరాత్ టైటాన్స్ తో కూడా హార్దిక్ పాండ్యా టచ్ లోకి వెళ్ళాడని ఈ సమాచారం.

హార్ధిక్ పాండ్యాను అవ‌మానించిన గుజ‌రాత్ టైటాన్స్‌

గుజరాత్ టైటాన్స్ జట్టుకు గతంలో హార్దిక్ పాండ్యా ఆడిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీ లోనే ఆ జట్టు టైటిల్ కూడా అందుకుంది. ఈ క్రమంలోనే ఆ జట్టులోకి వెళ్లేందుకు హార్దిక్ పాండ్యా చర్చలు కూడా జరిపాడట. గుజరాత్ కెప్టెన్సీ ఇస్తేనే, వస్తానని హార్దిక్ పాండ్యా కండిషన్ పెట్టాడట. దీనికి గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఒప్పుకోలేదు. జట్టులోకి వస్తే తనకు ఓకే కానీ.. కెప్టెన్సీ అడిగితే హార్దిక్ పాండ్యాను తీసుకునేది లేదని గిల్ స్పష్టం చేశారట. ఇక గిల్ చెప్పిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నోట్లో గిల్ మట్టి కొట్టాడని సోషల్ మీడియాలో ఫాన్స్ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి హార్దిక్ పాండ్యాను తీసుకోండి

గుజరాత్ టైటాన్స్ జట్టులో హార్దిక్ పాండ్యా కు ఛాన్స్ లేదని… అతని కండిషన్ కు యాజమాన్యం నో చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వదిలేసి, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రావాలని హార్దిక్ పాండ్యాకు పిలుపునిచ్చారు. ఇండియాలో నీకు సరైన గౌరవం ఇవ్వడం లేదని… పాకిస్తాన్ లోకి వస్తే.. మంచి ఆఫర్లు ఇస్తామని షాహిద్ అఫ్రిది బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Advertisement

టీమిండియాలో విపరీతంగా క్రికెటర్లు ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఎవరికి అవకాశం రావడం లేదని… ఇప్పుడు హార్దిక్ పాండ్యా అదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడతామంటే… 100 కోట్లు పెట్టైనా కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉంటాయని వెల్లడించారు. అలాంటి ఆటగాడిని ఎవరు వదులుకోరని పేర్కొన్నారు. ఆ దిశగా హార్దిక్ పాండ్యా ఆలోచన చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

నీకు టీమిండియా కంటే పెళ్లాం ఎక్కువైందా ? కోహ్లీపై దారుణంగా ట్రోల్స్ !

ముంబై ఇండియ‌న్స్ ఒక్క మ్యాచ్ గెల‌వొద్దు…స‌ర్వ నాశ‌నం కావాలి

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Big Stories

Advertisement
×