E-Paper
Advertisement

జింబాబ్వేలో అన్ని ఫ్లాట్ పిచ్ లే..అందుకే వైభ‌వ్ రెచ్చిపోయాడు

జింబాబ్వేలో అన్ని ఫ్లాట్ పిచ్ లే..అందుకే వైభ‌వ్ రెచ్చిపోయాడు
Advertisement

Kamran Akmal on Vaibhav: టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India) మధ్య నిన్న టి20 సిరీస్ (India tour of Zimbabwe 2026) ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు టి20 సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్ హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా (Harare Sports Club, Harare) జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టింది. హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) అదరగొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి రెచ్చిపోయాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. దాదాపు 260కి పైగా స్ట్రైక్ రేట్ సాధించిన వైభవ్.. కొట్టిన ప్రతి బంతి స్టేడియం అవతల పడింది. అయితే జింబాబ్వే అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై పాకిస్తాన్ విషం కక్క‌డం మొదలుపెట్టింది.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

జింబాబ్వేలో అన్ని ఫ్లాట్ పిచ్ లే..అందుకే వైభ‌వ్ రెచ్చిపోయాడు

Advertisement

హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో అర్ధ సెంచ‌రీ చేసిన త‌రుణంలో కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) కూడా వైభవ్ బ్యాటింగ్ ను హేళన చేస్తూ మాట్లాడారు. ఐపీఎల్ లాగా ఫ్లాట్ మైదానాలు జింబాబ్వే సిద్ధం చేసిందని… అందుకే వైభవ్ ఇరగదీసినట్లు బాంబు పేల్చారు. అంతే తప్ప వైభవ్ పీకిందేమీ లేదని పరువు తీశారు కమ్రాన్ అక్మల్. ఇంగ్లాండ్ గడ్డ పైన ఆడడం చేతకాలేదని… పసికూన జింబాబ్వేపై మాత్రం విరుచుకుపడ్డాడని సెటైర్లు వేశారు. ఆడితే పెద్ద జట్లు పైన ఆడాలి… కానీ చిన్న జట్లపైన ఆడి… పొంగిపోకూడదని చురకలు అంటించారు. ఇదే ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ పైన ఆడి ఉంటే… నిజంగానే వైభవ్ సూర్య వంశీ రియల్ హీరో అయిపోయే వాడని.. కానీ అక్కడ విఫలమైనట్లు ఎద్దేవా చేశారు. పసికూన జట్లపైన ఆడితే హీరోలు కాలేరని… హీరోలుగా మిగులుతారని హేళన చేశారు క‌మ్రాన్ అక్మ‌ల్.

జింబాబ్వే లో హైవే లాంటి పిచ్ లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ఏవైతే మైదానాలు ఉన్నాయో… అచ్చం అలాగే జింబాబ్వేలు కూడా తయారు చేసినట్లు సెటైర్లు పేల్చారు క‌మ్రాన్ అక్మ‌ల్. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 50 పరుగులు చేశాడన్నారు. ప్రతి బంతి స్టేడియం బయటకు కొట్టి… ఓవర్ నైట్ స్టార్ అయ్యాడని పేర్కొన్నారు. అసలు విషయం ఏంటంటే.. జింబాబ్వే లో ఉన్నవి ఫ్లాట్ మైదానాలని అందరూ గుర్తుపెట్టుకోవాలని సెటైర్లు పేల్చారు. బౌన్సీ పిచ్ లు అయితే, వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం గ్యారెంటీ అన్నారు. ఇది ఇలా ఉండగా నిన్నటి మ్యాచ్ లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 125 పరుగులు సాధించింది జింబాబ్వే. దీంతో రెచ్చిపోయిన టీమ్ ఇండియా క్రికెటర్లు… జింబాబ్వే బౌలర్లకు ఇచ్చి పడేశారు. ఈ క్రమంలో 13 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసి… తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు.

Advertisement

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

Related News

మారథాన్ మ‌ధ్య‌లోనే పీరియ‌డ్స్, లేడీ అథ్లెట్ కు తీవ్ర ర‌క్త‌స్రావం

ఒక్క అర్ధ సెంచ‌రీతో పాకిస్తాన్ కుక్క‌ల నోర్లు వైభవ్ మూయించాడు

టీమిండియాకు ల‌క్ష్మ‌ణుడే శ్రీరామ ర‌క్ష‌..జింబాబ్వే ఓట‌మిపై శ్రీశాంత్ సంచ‌ల‌నం

ప్ర‌తీ బంతి 150 కి.మీ వేగమా? మాయంక్ యాద‌వ్ కు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

మ‌ళ్లీ ఐపీఎల్ పిల్ల బ‌చ్చాల‌తోనే ఆడుతున్నారు..జింబాబ్వేతోనూ ఓట‌మి ఖాయం

Big Stories

Advertisement
×