E-Paper
Advertisement

‘ధడక్’ హిట్ అయినా డిప్రెషన్‌లోకి వెళ్ళాను.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

‘ధడక్’ హిట్ అయినా డిప్రెషన్‌లోకి వెళ్ళాను.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ తర్వాత వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సామాన్యం కాదు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తన తొలి సినిమా ‘ధడక్’ సమయంలో అనుభవించిన చేదు జ్ఞాపకాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, తాను మాత్రం తీవ్రమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యానని ఆమె వెల్లడించారు.

Read also-15 ఏళ్ల వయసులోనే ఆ వెబ్‌సైట్‌లో తన ఫోటోలు చూసిన జాన్వీ రియాక్షన్ ఇదే..

తల్లి మరణం..

Advertisement

జాన్వీ కపూర్ కెరీర్ అత్యంత విషాదకరమైన పరిస్థితుల మధ్య మొదలైంది. ఆమె మొదటి సినిమా విడుదల కావడానికి కొన్ని నెలల ముందే తల్లి శ్రీదేవి కన్నుమూశారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే ‘ధడక్’ విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అయితే, ఆ విజయం తనకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని జాన్వీ తెలిపారు. “లోపల తల్లి లేదనే పెద్ద శూన్యం ఉంది. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే ప్రశంసలు ఏవీ నన్ను ఓదార్చలేకపోయాయి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారు”

సినిమా విజయవంతమైనా, సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు జాన్వీని తీవ్రంగా కలచివేశాయి. కేవలం నెపోటిజం వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని, తనకు నటన రాదని వస్తున్న కామెంట్లను చూసి ఆమె భయపడ్డారు. “బయట జనం నన్ను ద్వేషిస్తున్నారని నేను బలంగా నమ్మాను. నా పని అయిపోయింది, ఇక నేను ఇండస్ట్రీలో నిలబడలేను అని మానసికంగా కుంగిపోయాను” అని ఆమె ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

Advertisement

Read also-This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

గుర్తింపు కోసం

జాన్వీకి చిన్నప్పటి నుండి తన ప్రతి పనిని తల్లి మెచ్చుకోవాలని ఉండేది. శ్రీదేవి మరణం తర్వాత ఆ గుర్తింపును ప్రేక్షకుల నుండి ఆశించారు. కానీ, అందరూ విమర్శించడంతో ఆమెకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. వంద మంది పొగిడినా, ఒక్కరు విమర్శించినా ఆ నెగెటివిటీనే తనను ఎక్కువగా బాధించేదని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో కలిగిన ఒంటరితనం తనను డిప్రెషన్‌లోకి నెట్టిందని ఆమె స్పష్టం చేశారు.

నేర్చుకున్న పాఠం

ఆ కఠినమైన రోజులే తనను ఇప్పుడు దృఢంగా మార్చాయని జాన్వీ తెలిపారు. ప్రస్తుతం విమర్శలను ఎలా తీసుకోవాలో, తనపై తాను నమ్మకాన్ని ఎలా ఉంచుకోవాలో నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు ఆమె కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, సౌత్ ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ అలరిస్తుందో చూడాలి మరి.

Related News

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×