E-Paper
Advertisement

‘చుట్టమల్లే’ ఏఐ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. శిక్ష తప్పదంటూ హెచ్చరిక!

‘చుట్టమల్లే’ ఏఐ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. శిక్ష తప్పదంటూ హెచ్చరిక!
Advertisement

Janhvi Kapoor: అధునాతన టెక్నాలజీ ఏఐని ఉపయోగించి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్ఫింగ్ బ్యాచ్ కి తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా స్పందించింది. ఎన్టీఆర్ (NTR )హీరోగా, కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ ను ఏఐ ఉపయోగించి అసభ్యకర రీతిలో సృష్టించడమే కాకుండా.. అందులో జాన్వీకపూర్ ను అసభ్యకరంగా చూపించిన నేపథ్యంలో అటు ఎన్టీఆర్, ఇటు జాన్వీ కపూర్ మండిపడుతూ వార్నింగ్ ఇచ్చారు.

చుట్టమల్లే ఏఐ వివాదంపై స్పందించిన జాన్వీ కపూర్..

చుట్టమల్లే సాంగ్ ను ఏఐ ఉపయోగించి రూపొందించిన నకిలీ వీడియో పై ఆమె స్పందిస్తూ ..” ఏఐ రూపొందించిన నకిలీ వీడియోలు ప్రచారం అవుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. దయచేసి అటువంటి కంటెంట్ ను సృష్టించవద్దు.. పంచుకోవద్దు.. లేదా ఎక్కడా ప్రచారం చేయవద్దు.. ఇది ఏఐ స్పష్టమైన దుర్వినియోగం.. ఇందులో పాల్పడిన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. జై హింద్ ” అంటూ జాన్వీ కపూర్ హెచ్చరించింది. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మార్ఫింగ్ బ్యాచ్ కి ఎన్టీఆర్ మాస్ వార్నింగ్..

Advertisement

ఇక మరొకవైపు ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ విడుదల చేస్తూ.. ఏఐ టెక్నాలజీతో కొందరు వికృతి చేష్టలకు పాల్పడుతుండడం పై నిప్పులు చెరిగారు ఎన్టీఆర్. “ఇది అసహ్యకరం.. రోత పుట్టించే సిగ్గుమాలిన పని. స్త్రీలను తల్లిగా, దేవతగా పూజించే నేల మనది. మాతృదేవోభవ అనేది కేవలం మాట మాత్రమే కాదు.. మన సంస్కృతిలో ఒక భాగం. అలాంటి పవిత్రమైన గడ్డపై మహిళలను ఇంత దారుణంగా కించపరిచేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతూ కొందరు ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనిది. మార్ఫ్ చేసిన చుట్టమల్లే వీడియో వెనుక ఉన్న నీచుల్లారా.. ఎవరిని నేను వదిలిపెట్టను. ఈ వీడియో క్రియేట్ చేసిన వారిపై, దీనిని సర్క్యులేట్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాము” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

also read: ‘చుట్టమల్లే’ ఏఐ వివాదం.. ఎన్టీఆర్ మాస్ వార్నింగ్!

ఇలాంటి కంటెంట్ ను చూసినా.. షేర్ చేసినా తప్పే..

Advertisement

అంతేకాదు ఇలాంటి వికృత కంటెంట్ ను ప్రోత్సహించవద్దని, నెటిజన్ లను ఎన్టీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేయడమే కాదు వాటిని చూసినా, ఇతరులకు షేర్ చేసినా కూడా తప్పే అని, ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలంటూ ఆయన కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దేవర సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత కాలంలో ఏకంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మంచి విజయం సొంతం చేసుకుంది.

Related News

హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. ఆమె రియాక్షన్?

రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!

‘చుట్టమల్లే’ ఏఐ వివాదం.. ఎన్టీఆర్ మాస్ వార్నింగ్!

పైలెట్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్!

నడవలేని స్థితిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్…ఇలా మారిపోయారేంటీ?

మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ‘ఆరుగురు పతివ్రతలు’ .. ఎప్పుడంటే?

రణబాలి నుంచి మూడవ డాక్యుమెంటరీ ‘ది మెన్ వుయ్ ఫర్గాట్’ సిరీస్ రిలీజ్

Big Stories

Advertisement
×