E-Paper
Advertisement

రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!

రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!
Advertisement

Vijay Devarakonda -Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ప్రస్తుతం రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. తాజాగా యాంకర్ సుమతో కలిపి డైరెక్టర్ తో పాటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)రష్మిక(Rashmika) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా విజయ్ రష్మిక సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పాలేగాళ్ల స్ఫూర్తితో రణబాలి పాత్ర…

ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ సినిమా ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని డైరెక్టర్ రాహుల్ తెలియచేశారు. ప్రేక్షకులకు మరుగున పడిపోయిన ఒక హిస్టరీని పరిచయం చేయబోతున్నామని, విజయ్ దేవరకొండ పాత్ర పాలేగాళ్లను స్ఫూర్తిగా తీసుకొని రణబాలిగా మీ ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా మాస్ డైలాగులు చెప్పారు. ఇదివరకే విడుదల చేసిన గ్లింప్స్ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

రేయ్ నీయక్కా అని పిలుస్తుందా..

Advertisement

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలోని ఒక చిన్న సన్నివేశం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రష్మికతో నాకు పెళ్లయిన తర్వాత ఆమె నాతో ఏదో చెప్పాలని నన్ను పిలుస్తుంది నేనేదో పనిలో ఉండి పలకను. అలా తను పిలిచినప్పుడు కనుక నేను పలకకపోతే నన్ను ఏకంగా “రేయ్ నీయక్కా” అని పిలుస్తుంది అంటూ విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా విజయ్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో వామ్మో రష్మిక ఇలా మాట్లాడుతారా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న నేపథ్యంలో రాయలసీమ యాస, అక్కడ వాడే పదాలను ఎక్కువగా ఉపయోగించారని తెలుస్తోంది. ఇక నీయక్కా అనే పదం రాయలసీమలో ఎక్కువ వాడుక పదం అని చెప్పాలి. ఇక ఈ సినిమా 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలనలో భాగంగా సీమ ప్రజలు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆ సమయంలో ఏర్పడిన కరువు కాటకాల గురించి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాకు సంబంధించి మూడు డాక్యుమెంటరీలను విడుదల చేయగా ఈ డాక్యుమెంటరీ వీడియోలకి కూడా చాలా మంచి ఆదరణ లభించింది. విజయ్ రష్మిక పెళ్లి తర్వాత మొదటిసారి రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మరి ఈ సినిమా ఈ దంపతులకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: నడవలేని స్థితిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్…ఇలా మారిపోయారేంటీ?

Related News

వందల కోట్లు పోగొట్టుకున్న హీరో నవదీప్?

నేను సన్నీ లియోన్ లాంటి వాడిని..అన్నీ విప్పేసా ..వేణు స్వామి వైరల్ కామెంట్స్ !

హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. ఆమె రియాక్షన్?

‘చుట్టమల్లే’ ఏఐ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. శిక్ష తప్పదంటూ హెచ్చరిక!

‘చుట్టమల్లే’ ఏఐ వివాదం.. ఎన్టీఆర్ మాస్ వార్నింగ్!

పైలెట్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్!

నడవలేని స్థితిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్…ఇలా మారిపోయారేంటీ?

Big Stories

Advertisement
×