BigTV English

Viral video: స్విగ్గి.. బ్లింకిట్ డెలివరీ బాయ్స్‌గా వచ్చారు.. బంగారం అంతా దోచేశారు!

Viral video: స్విగ్గి.. బ్లింకిట్ డెలివరీ బాయ్స్‌గా వచ్చారు.. బంగారం అంతా దోచేశారు!

సాధారణంగా దొంగతనాలు, దోపిడీలు రాత్రిపూట జరుగుతాయి. కానీ, ఇప్పుడు పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. అందరూ చూస్తుండగానే దోచుకెళ్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు డెలివరీ బాయ్స్ డ్రెస్సులో వచ్చి క్షణాల్లో నగల దుకాణాన్ని దోచుకెళ్లారు. తాజాగా ఈ దోపిడీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ

ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని గజియాబాద్‌ లో జరిగింది. బ్రిజ్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలోకి ఇద్దరు యువకులు డెలివరీ బాయ్స్ వేషాల్లో వచ్చారు. ఆ సమయంలో దుకాణం యజమాని భోజనానికి వెళ్లారు. అందులో పని చేసే ఓ వర్కర్ మాత్రమే అందులో ఉన్నాడు. బైక్ మీద వచ్చిన యువకులు డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో దుకాణంలో ఉన్న యువకుడిని బెదిరించారు. అతడిని ఒక మూలకు నిల్చోవాలని చెప్పారు. క్షణాల్లో దుకాణంలోని బంగారం, వెండి వస్తువులను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. అక్కడి నుంచి క్షణాల్లో బయటపడ్డారు. తెచ్చుకున్న బైక్ మీదే పరారయ్యారు.


పోలీసులకు ఫిర్యాదు చేసిన దుకాణం యజమాని

బంగారం దుకాణం యజమాని భోజనానికి వెళ్లి వచ్చే సరికి షాప్ ఖాళీ అయ్యింది. లబోదిబోమన్న ఆయన, పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుకాణంతో పాటు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దుకాణంలో 20 కిలోల వెండి, 125 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించారు. దొంగతానికి గురైన బంగారం, వెండి ఆభరణాల ధర సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని షాపు యజమాని చెప్పాడు. అయితే, ఈ దోపిడీకి దుకాణంలో పని చేసే యువకుడికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

 నెటిజన్లు ఏం అంటున్నారంటే?

అటు డెలివరీ బాయ్స్ వేషంలో వచ్చిన దొంగపై నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. “ఇది దోపిడీ కాదు. ఎవరో ఆభరణాలను ఆర్డర్ చేశారు. వారు 10 నిమిషాల్లో వాటిని ప్యాక్ చేసి డెలివరీ చేయడానికి తొందరపడుతున్నారు! వారు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోండి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రీసెంట్ గా పలు చోట్ల ఇలాంటి ఘటనలు

ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. జనవరిలో, పూణేలోగణేష్ కథేవాడే డెలివరీ బాయ్‌ గా వేషం వేసుకుని.. ఖాళీ ఫ్లాట్‌ లలో 14 చోరీలు చేశాడు. రూ. 80 లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించారు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఏప్రిల్‌ లో ఢిల్లీలోని కల్కాజీలో ఒక వ్యక్తి డెలివరీ బాయ్ వేషంలో వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి, వారిని కట్టివేసి నగదు,  బంగారాన్ని దోచుకున్నాడు.  అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.  జూన్‌లో నలుగురు వ్యక్తులు వసంత్ కుంజ్ ఫామ్‌ హౌస్‌ ను డెలివరీ బాయ్స్ వేషంలో వచ్చి దోచుకున్నారు.

Read Also: హైదరాబాద్ నుంచి వెళ్లే ఆ రైళ్లలో స్లీపర్ కోచ్‌ల పెంపు.. ఇక ఆ కష్టాలు తీరినట్లే!

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×