E-Paper
Advertisement

సిటీలో కోచింగ్ సెంటర్ల గుట్టురట్టు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు!

సిటీలో కోచింగ్ సెంటర్ల గుట్టురట్టు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు!
Advertisement

Coaching Centres: కొన్ని వింటే తెలుస్తాయ్! కొన్ని చూస్తేనే అర్థమవుతాయ్! యూపీలోని లక్నోలో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 15 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. అప్పుడు రైజ్ అయింది ఓ క్వశ్చన్! మన హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు సేఫేనా? అని! అంతే.. బిగ్ టీవీ గ్రౌండ్‌లోకి దిగింది. కోచింగ్ సెంటర్ల చుట్టూ ఓ రౌండ్ వేసింది. అప్పుడు తెలిసింది.. అవి కోచింగ్ సెంటర్లు కాదు! డేంజర్ స్పాట్స్ అని! అమీర్‌పేట్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్.. ఇలా ఏ ఏరియాకు వెళ్లినా.. ఏ కోచింగ్ సెంటర్‌ మెట్లెక్కినా.. ఎప్పుడెలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని టైమ్ బాంబులపై కూర్చొని చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులే కనిపిస్తున్నారు.

ఫైర్ సేఫ్టీ రూల్స్‌ అసలే పట్టించుకోకుండా..

Advertisement

ఇరుకు గల్లీలు.. ఫ్లోర్ల మీద ఫ్లోర్లు.. చుట్టూ కమ్మేసిన ఫ్లెక్సీలు.. గాలి కూడా దూరని గదులు! మహా నగరంలో ఏ కోచింగ్ సెంటర్ చూసినా గుండెలదిరిపోతున్నాయ్. ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా అంతే సంగతి! పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదకర పరిస్థితులున్నాయ్. వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లు.. కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా, ఫైర్ సేఫ్టీ రూల్స్‌ అసలే పట్టించుకోకుండా.. నడిపించేస్తున్నారు. ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితేంటి? మంటలు కమ్మేస్తే.. తప్పించుకునే మార్గమేది? సిటీలో కోచింగ్ సెంటర్ల భద్రతపై బిగ్ టీవీ చేసిన ఆపరేషన్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపడ్డాయ్. బిల్డింగ్‌ల్లో ఫైర్ సేఫ్టీ లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు లేవు. కమర్షియల్, రెసిడెన్షియల్ అనే తేడా లేకుండా.. ఎక్కడపడితే అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ.. కోట్లు సంపాదించుకునే కోచింగ్ సెంటర్లు.. బేసిక్ ఫైర్ సేఫ్టీ మెజర్స్‌ని గాలికొదిలేశాయ్. వందల మంది విద్యార్థులు చదివే చోట.. కనీస భద్రత లేకపోతే ఎలా?

శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ

Advertisement

కోచింగ్ సెంటర్.. అకాడమీ.. ఇన్‌స్టిట్యూట్.. ట్యాగ్ ఏదైనా ఏవీ సేఫ్టీ ట్రాక్‌లో లేవు. ఇది.. అశోక్‌నగర్‌లోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఐదు అంతస్తుల్లో క్లాస్ రూమ్‌లు ఉన్నాయి. ఈ బిల్డింగ్‌కు ఫైర్ సేఫ్టీ లేనే లేదు. పైగా.. ఇక్కడున్న కరెంటు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయ్. ఒక్క క్లాసులో.. 50 నుంచి 60 మంది బ్యాచ్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఈ బిల్డింగ్ నుంచి తప్పించుకోవడం.. దీని ప్లానింగ్ గీసినోళ్లకి కూడా కష్టమే!

Also Read: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం.. నీరవ్ మోడీ లండన్ జైలు టు ఇండియా.. పూర్తి వివరాలు!

అభిరామ్ ఐఏస్ అకాడమీ

ఇది.. అశోక్‌నగర్‌లోని అభిరామ్ ఐఏస్ అకాడమీ. లోపలికి వెళితే గానీ అర్థం కాలేదు.. ఎంత దారుణంగా ఉందో! ఒక్క ఫైర్ సేఫ్టీ సిలిండర్ కూడా కనిపించలేదు. ఆఫీస్ వెనకాలే.. పెద్ద క్లాస్ రూమ్ ఉంది. దానికి సరైన వెంటిలేషన్ లేదు. ఈ క్లాస్ రూమ్‌లో 100 మందికి పైగా విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్‌లు సరిగ్గా లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండానే.. ఈ కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు.

విష్ణు ఐఏఎస్ అకాడమీ

అశోక్‌నగర్‌లోని మరో కోచింగ్ సెంటర్ ఇది. దీనిపేరు.. విష్ణు ఐఏఎస్ అకాడమీ. 3 అంతస్తుల్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్‌కు కూడా ఫైర్ సేఫ్టీ లేదు. ఆఫీసులో మాత్రం నామ్ కే వాస్తే.. ఒక ఫైర్ సేఫ్టీ సిలిండర్ కనిపించిందంతే! క్లాస్ రూమ్స్‌లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేవు. ఇందిరాపార్క్ సిగ్నల్ దగ్గర్లో ఉన్న అనలాగ్ ఐఏఎస్ అకాడమీ బిల్డింగ్‌కి కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఈ బిల్డింగ్‌కు అయితే సెట్ బ్యాక్ కూడా లేదు. సేఫ్టీ మెజర్స్ ఏవీ లేకుండానే.. ఈ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. హైదరాబాద్‌లోనే మోస్ట్ పాపులర్ కోచింగ్ సెంటర్.. R.C.రెడ్డిది కూడా ఇదే పరిస్థితి. ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఈ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. 150 నుంచి 200 మంది స్టూడెంట్స్‌కి ఒకే రూమ్‌లో క్లాసులు చెబుతున్నారు. కానీ.. ఒక్క ఫ్లోర్ కూడా బేసిక్ ఫైర్ సేఫ్టీ లేదు. ఫైర్ ఎగ్జిట్ ఆనవాళ్లు కూడా కనిపించలేదు.

రాథోడ్ ఐఏఎస్ అకాడమీ..

రాథోడ్ ఐఏఎస్ అకాడమీ అయితే.. ఏకంగా ఐదో ఫ్లోర్‌లో ఉంది. అంతపైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఫెసిలిటీ సరిగా లేదు. పైకి వెళ్లేందుకు ఇరుకైన మెట్ల మార్గం ఉంది. పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ జరిగితే.. ఈ మెట్లు తప్ప మరో దారిలేదు. పైగా.. ఈ ఐదంస్తుల బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. అప్పుడప్పుడు భవనం పైకప్పు పెచ్చులూడి విద్యార్థుల నెత్తిమీద పడుతున్నాయ్. రూల్స్ ప్రకారం.. ఇలాంటి భవనాల్లో ఫుల్ ఫైర్ సేఫ్టీ ఉండాలి. కానీ.. ఇక్కడలాంటిదేమీ కనిపించలేదు.

Also Read: తాజ్‌మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?

ఇన్‌స్టిట్యూట్ లోపలికి వెళ్లాలంటే..

షైన్ అకాడమీలోనూ అదే పరిస్థితి. ఫైర్ సేఫ్టీ నిల్ ఇక్కడ! ప్రమాదం జరిగితే.. వందలాది మంది స్టూడెంట్స్ తప్పించుకునేందుకు మరో ఎమర్జెన్సీ డోర్ లేదు. పైగా.. ఒకే క్లాస్ రూమ్‌లో 80, 90 మంది విద్యార్థులను కూర్చోబెట్టి కోచింగ్ ఇస్తున్నారు. అశోక్ ఐఏస్ అకాడమీ కూడా ఇంతే! ఇన్‌స్టిట్యూట్ లోపలికి వెళ్లాలంటే.. ఇరుకైన మెట్ల మార్గం నుంచే వెళ్లాలి. ప్రమాదం జరిగితే అలర్ట్ చేసేందుకు ఒక్క సైరన్ బాక్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేదు. విద్యార్థుల భద్రతను గాలికొదిలేసి.. కమర్షియల్ ప్రయోజనాల కోసమే అడ్డగోలుగా సెంటర్ నడుపుతున్నారు. ఇవన్నీ చూశాక.. అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ఏరియాల్లో.. కోచింగ్ సెంటర్లు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో రన్ అవుతున్నాయో అర్థమైంది.

స్టడీస్ కోచింగ్ సెంటర్లకు అడ్డా అమీర్ పేట్..

లేడీస్ మ్యాచింగ్ సెంటర్లకే కాదు.. స్టడీస్ కోచింగ్ సెంటర్లకు కూడా అడ్డా అమీర్‌పేట్! అయితే, అవి ఉండాల్సిన రీతిలో లేవు. ఎలా ఉండకూడదన్న దానికి ఎగ్జాంపుల్స్‌గా ఉన్నాయ్. ఇది.. హరీశ్ ఐటీ ఇండస్ట్రీ. ఇందులో.. ఒకే ఒక్క హాల్ ఉంటుంది. దానినే.. 4 బ్లాక్‌లుగా డివైడ్ చేసి.. 4 రకాల కోచింగ్‌లు ఇస్తున్నారు. ఒక్కో రూమ్‌లో 50 మంది వరకు కోచింగ్ ఇస్తున్నారు. ఇది చూడటానికి ఓ 1 BHK ఫ్లాట్‌లా ఉన్నా.. వందల మంది ఇక్కడే చదువుకుంటారు. ఇక్కడ కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ప్రమాదం జరిగితే.. తప్పించుకునే ఛాన్స్ లేదు. ఒకేసారి అంతా బయటకొచ్చే అవకాశమే లేదు.

నడిచే గ్యాప్ కూడా ఉండట్లేదు..

కూకట్‌పల్లిలోని ఈ బిల్డింగ్ బాగా చూడండి. ఇందులోనే.. మైండ్ బెండ్ అయ్యే విషయం ఉంది. బిల్డింగ్ ఒక్కటే! కానీ, కోచింగ్ సెంటర్లు మూడు రన్ అవుతున్నాయ్. ఇందులో.. రేస్ అకాడమీ, విజేత, ఈజీ గురు కోచింగ్ సెంటర్లున్నాయ్. అన్నింట్లోనూ.. సేమ్ సిచ్యువేషన్. ఎందులోనూ.. ఫైర్ సేఫ్టీ ఉండదు. క్లాస్ రూమ్‌లన్నీ ఇరుగ్గానే ఉంటాయ్. వెంటిలేషన్ కూడా సరిగా ఉండదు. చివరకు.. క్లాస్ రూమ్స్‌లోని బెంచీల మధ్య నడిచే గ్యాప్ కూడా ఉండట్లేదు.

Also Read: పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

ఊహించని స్థాయిలో ప్రాణనష్టం

ఇది.. శ్రీవేద స్టడీ హాల్. క్యాబిన్లన్నీ ఇరుగ్గా ఉన్నాయ్. పైగా.. బిల్డింగ్ కూడా పాతదైపోయింది. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లేవీ లేవు. ఇరుకైన మెట్ల మార్గం వల్ల.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావడం కష్టం. మేధ ఎడ్యు టెక్, జీసీఎస్ ఇనిస్టిట్యూట్‌లోనూ ఇవే సీన్లు. ఇరుకైన రేకుల రూమ్‌లో.. మేధ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. గాలి, వెలుతురు సరిగ్గా రావట్లేదు. చిన్న ఆఫీస్‌ స్పేస్‌ని.. డివైడ్ చేసి కౌన్సిలింగ్, కోచింగ్ ఇస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అసలే లేవు. ఇక్కడ గనక ప్రమాదం జరిగితే.. ప్రాణనష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. జీసీఎస్‌లోనూ ఇదే కథ. పెద్ద హాల్‌ని డివైజ్ చేసి.. వాటిల్లో వివిధ కోర్సులు నేర్పిస్తున్నారు. ఇక్కడ.. ఫైర్ సేఫ్టీ ఆనవాళ్లు కూడా లేవు. ప్రమాదం జరిగితే.. అంతా ఇరుకైన ఈ మార్గం గుండానే కిందకు రావాల్సి వస్తుంది. అమీర్‌పేట్, కూకట్‌పల్లిలో.. ఏ కోచింగ్ సెంటర్‌కి వెళ్లినా.. ఒక్క దానికి కూడా ఫుల్ మార్క్స్ పడే పరిస్థితి లేదు.

రామయ్య ఇన్‌స్టిట్యూట్..

హైదరాబాద్‌లో ఏరియా మారితే అడ్రస్ మారుతుంది. కానీ.. కోచింగ్ సెంటర్లు ఎందుకు మారతాయ్? సిటీలో ఎక్కడికెళ్లినా ఇనిస్టిట్యూట్‌ల యవ్వారం ఒకేలా ఉంది. ఇది.. దిల్‌సుఖ్‌నగర్‌లోని రామయ్య ఇన్‌స్టిట్యూట్. ఇరుకైన బిల్డింగ్‌ల మధ్య ఉంది. లిఫ్ట్ లేదు. ఎమర్జెన్సీ సేఫ్టీ మెజర్స్ లేవు. ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో బయటకొచ్చేందుకు ఆల్టర్నేట్ రూట్లు లేవు. ఈ సెంటర్‌లో.. భద్రతా పరిస్థితి పూర్తిగా ఆందోళనకరంగా ఉంది.

గోల్కొండ ఇన్‌స్టిట్యూట్..

ఇది.. గోల్కొండ ఇన్‌స్టిట్యూట్. చూస్తున్నారుగా ఎలా ఉందో! మూడో అంతస్తులో క్లాసెస్ జరుగుతాయి. ఇరుకైన ఈ మెట్ల మీద నుంచే విద్యార్థులు పైకి వెళ్లాలి. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించట్లేదు. చుట్టూ బిల్డింగ్‌లు ఉండటం వల్ల.. అనుకోని ప్రమాదం జరిగితే.. విద్యార్థులు బయటపడటం కష్టం. పైగా.. బిల్డింగ్ చుట్టూ భారీ ప్లెక్సీలు ఉండటం వల్ల.. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

Also Read: ధరణి ‘ఘోస్ట్’ దందా.. ఓటీపీ లేదు, ఓనర్ లేడు.. అర్ధరాత్రి వేల ఎకరాలు మాయం!

యూనిక్ కోచింగ్ సెంటర్..

దీని పేరు యూనిక్ కోచింగ్ సెంటర్. రెండో అంతస్తులో.. 200 నుంచి 300 మందికి పైగా విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు. ఈ బిల్డింగ్‌లోనూ.. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అస్సలు కనిపించట్లేదు. బిల్డింగ్ పూర్తి కాకముందే.. కోచింగ్ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు.. ఎమర్జెన్సీ ఎస్కేప్ మార్గాలు లేవు. పార్కింగ్‌లోనూ తగిన భద్రతా చర్యలు లేవు. ఇవి మాత్రమే కాదు.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఏ కోచింగ్ సెంటర్‌లోకి అడుగుపెట్టినా.. ఇదే కథ! వేలల్లో ఫీజులు కట్టినా.. కోచింగ్ సెంటర్లు కోట్లు వెనకేసుకున్నా.. సేఫ్టీ మాత్రం నిల్. డేంజర్ మాత్రం ఫుల్. ఇదే.. ఇప్పుడు కోచింగ్ సెంటర్లలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ పెంచుతోంది.

Related News

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం.. నీరవ్ మోడీ లండన్ జైలు టు ఇండియా.. పూర్తి వివరాలు!

తాజ్‌మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?

పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

ధరణి ‘ఘోస్ట్’ దందా.. ఓటీపీ లేదు, ఓనర్ లేడు.. అర్ధరాత్రి వేల ఎకరాలు మాయం!

ఫ్రూట్స్, ఫిష్ కోడ్‌లతో డ్రగ్స్ దందా.. హైదరాబాద్‌లో నయా ట్రెండ్!

మెట్రో ప్రయాణికులకు తిప్పలు: డిజిటల్ జోరు.. సామాన్యుడికి బేజారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ఉక్కుపాదం.. తెలంగాణ కొత్త బిల్లు ప్రత్యేకతలు!

Big Stories

Advertisement
×