E-Paper
Advertisement

OTT Movie : కాకులు దూరని కారడవిలో ఇల్లు… థ్రిల్లింగ్ ట్విస్టులు… అవార్డు విన్నింగ్ సైకో థ్రిల్లర్

OTT Movie : కాకులు దూరని కారడవిలో ఇల్లు… థ్రిల్లింగ్ ట్విస్టులు… అవార్డు విన్నింగ్ సైకో థ్రిల్లర్
Advertisement

OTT Movie : సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా, అభిమానులకు ఒక చక్కని ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఇందులో ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై, సైకో కిల్లర్ కన్ను పడుతుంది. ఆ తరువాత స్టోరీ రక్త పాతంతో వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ చిత్రం తక్కువ డైలాగ్‌లతో, ఎక్కువ సస్పెన్స్ తో నడుస్తూ టెన్షన్ పెట్టిస్తుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మాడీ చెవిటి, మూగ ఉన్న ఒక రచయిత్రి. తన కొత్త నవలను పూర్తి చేయడానికి అడవిలోని ఒక ఒంటరి ఇంట్లో ఉంటుంది. ఆమెకు బాల్యంలో వచ్చిన అనారోగ్యం వల్ల చెవుడు, మాట రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ఆమె తన తెలివితో లైఫ్ ని సాగిస్తుంది. ఒక రాత్రి ఆమె స్నేహితురాలు సారా మాడీని కలసి వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్లో మాడీ ఒంటరిగా ఉంటుంది. అదే సమయంలో ఒక ముసుగు ధరించిన హంతకుడు ఒక కత్తితో సారాను హత్య చేసి, మాడీ ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. మాడీకి తన చెవుడు కారణంగా మొదట హంతకుడు వచ్చినట్టు కనిపెట్టలేకపోతుంది. కానీ అతను ఆమెను భయపెట్టడానికి, ఆమె ఫోన్, ఇంటి కరెంట్ సరఫరాను నాశనం చేస్తాడు. మాడీ పరిస్థితిని గమనించి, అతని నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

మాడీ తన తెలివి, ధైర్యాన్ని ఉపయోగించి, హంతకుడి నుండి తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్ లు వేస్తుంది. ఆమె రచయితగా తన ఊహాశక్తిని ఉపయోగించి, తన నవలలోని పాత్రల మాదిరిగా బతకడానికి మార్గాలను ఆలోచిస్తుంది. ఈ లోగా సారా భర్త అక్కడికి సారా కోసం వస్తాడు. అయితే హంతకుడు అతన్ని కూడా దారుణంగా చంపుతాడు. ఈ చిత్రం ఒక గంటకు పైగా సస్పెన్స్‌తో నడుస్తూ, మాడీ కిల్లర్ పై చేసే పోరాటాన్ని చూపిస్తుంది. ఆమె ఇంటిలోని వస్తువులను ఆయుధాలుగా ఉపయోగిస్తూ, హంతకుడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక క్లైమాక్స్ రక్తపాతంతోనే ముగుస్తుంది. మాడీ కిల్లర్ ని చంపుతుందా ? కిల్లర్ చేతిలో మాడీ బలవుతుందా ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో

‘Hush’ మైక్ ఫ్లానగన్ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో కేట్ సీగెల్, జాన్ గల్లఘర్ Jr., మైఖేల్ ట్రూకో, సమంతా స్లోయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 ఏప్రిల్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 81నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 6.6/10 రేటింగ్ ను పొందింది.

Read Also : అయ్య బాబోయ్… అమ్మాయిలు ఆ విద్య నేర్చుకోవాలంటే ఇతనితో ఏకాంతంగా… ఈ హర్రర్ మూవీలో ఆ సీన్లే హైలెట్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×