E-Paper
Advertisement

షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!

షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!
Advertisement

Deepthi Sunaina: దీప్తి సునయన ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె అనంతరం వెబ్ సిరీస్ లలో కూడా నటించి సందడి చేశారు. ఇలా నటిగా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దీప్తి సునయన బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈమె పలు బిజినెస్లను కూడా ప్రారంభించి ఎంతో బిజీగా గడుపుతున్నారు.

షన్నుతో లవ్ బ్రేకప్…

ఇకపోతే దీప్తి సునయన (Deepthi Sunaina) గతంలో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) ను ప్రేమించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ భావించారు కానీ అనుకోకుండా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. షన్ను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి అక్కడ సిరి హనుమంత్ తో క్లోజ్ గా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు రావడం బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఇలా వీరిద్దరి బ్రేకప్ తర్వాత షణ్ముక్ జస్వంత్ మూవ్ ఆన్ అవుతూ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈయన తన వృత్తిపరమైన జీవితంలో అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు.

అందరూ పెళ్లి చేసుకుంటే నేను చేసుకోవాలా?

Advertisement

ఇకపోతే దీప్తి సునయన పెళ్లి ఎప్పుడు అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తూనే ఉన్నాయి. షన్ను పెళ్లి చేసుకోవడంతో దీప్తి కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు భావించారు. అయితే తన పెళ్లి గురించి ఈ విధంగా వస్తున్న కామెంట్ల పట్ల దీప్తి సునయన స్పందించారు. మీరందరూ కూడా పక్కింటి ఆంటీ వాళ్ళ మాదిరిగా, బంధువులు మాదిరిగా తయారయ్యారు. ఎందుకంటే అందరి పెళ్లిళ్లు జరిగిపోయాయి నువ్వు కూడా పెళ్లి చేసుకో అంటూ మాట్లాడుతున్నారు. అందరు పెళ్లిళ్లు చేసుకుంటే నేను కూడా పెళ్లి చేసుకోవాలా? లేట్ మ్యారేజ్ ఈజ్ బెటర్ ధ్యాన్ రాంగ్ మ్యారేజ్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

?vrfl=ajg2N240cGhvaWg%3D

Advertisement

ఇలా ప్రతి ఒక్కరు తన పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈమె ఇలాంటి సమాధానం చెప్పారని తెలుస్తుంది. ఆవేశపడి తప్పుడు వివాహం చేసుకోవడం కంటే ఆలస్యంగా మంచిగా పెళ్లి చేసుకోవడం బెటర్ అంటూ ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం దీప్తి సునయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె పూర్తిగా తన ఫోకస్ అంత కెరియర్ పైన తన వ్యాపారాల పైన పెట్టారని తెలుస్తుంది. ఇక సరైన అబ్బాయి దొరికినప్పుడు ఖచ్చితంగా దీప్తి కూడా కొత్త జీవితం ప్రారంభిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

Related News

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!

నరేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఏంటి సామి!

నవ్య సామి సీరియల్స్ గుడ్ బై చెప్పడానికి కారణమేంటి..?

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Big Stories

Advertisement
×