E-Paper
Advertisement

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?
Advertisement

FTA Opportunities; తెలంగాణ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైదరాబాద్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) రాష్ట్రస్థాయి మెగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర వాణిజ్య శాఖ సహకారంతో టీ-హబ్‌ ఫేజ్‌-2లో మధ్యాహ్నం ప్రారంభం కానుంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని కీలకోపన్యాసం చేయడంతో పాటు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై రూపొందించిన వీడియోలను విడుదల చేయనున్నారు.

ఒప్పందాల ద్వారా..

భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించుకుని తెలంగాణ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ఆదరణ పొందేలా చేయడంపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలోని ఎగుమతిదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులు, స్టార్టప్‌లు, పారిశ్రామిక వేత్తలకు ఈ ఒప్పందాల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు.

ప్రోత్సాహక మిషన్‌..

Advertisement

తెలంగాణలో ఎగుమతుల విస్తరణకు ఉన్న అవకాశాలపై వివిధ శాఖల అధికారులు, రంగాల నిపుణులు ప్రసంగించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పసుపు పంట ఎగుమతులను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై జాతీయ పసుపు బోర్డు ప్రతినిధులు అవగాహన కల్పించనున్నారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ కింద రాష్ట్రంలోని జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చేసే అంశంపైనా చర్చించనున్నారు. గతంలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రయోజనం పొందిన స్థానిక ఎగుమతిదారులు తమ అనుభవాలను పంచుకోనున్నారు.

Also read: రోహిత్ ఎలిమినేషన్.. నాగార్జున పై బెదిరింపులకు దిగిన రోహిత్ ఫ్యాన్స్!

Tags

Related News

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ వేడుకలు!

Big Stories

Advertisement
×