Jobs in Tollywood : గత కొంతకాలంగా సినీ కార్మికులు జీతాల పెంపుపై డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి డిమాండ్ కి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. షూటింగ్లను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరయ్యేది లేదు అని తేల్చి చెప్పారు. దీంతో కార్మికుల డిమాండ్లపై ఫిలిం ఛాంబర్ సభ్యులు భేటీ అయ్యి.. కార్మిక సంఘాలు కోరుతున్నట్లు 30% జీతాల పెంపు సాధ్యం కాదు అని, టీఎఫ్సీసీ(TFCC )ప్రకటన విడుదల చేసింది.
కార్మికుల వేతనాల పెంపు పై TFCC కీలక ప్రకటన..
ప్రస్తుతం సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో జీతాలు పెంచాలని ధర్నా చేయడం సరికాదు అని ప్రకటనలో పేర్కొంది. వేతనాల పెంపు కారణంగా చిన్న నిర్మాతలు ఇబ్బందులు పడతారని, ఆర్థిక భారాన్ని భరించలేరు అని, వేతనాల పెంపును నిర్మాతలు అందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ ప్రకటన జారీ చేశారు. అంతేకాదు అదే ప్రకటనలో కనీస వేతన చట్టం ప్రకారం ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉంది అని కూడా స్పష్టం చేశారు.
యూనియన్ కారణంగా ఎంప్లాయిస్ కి ఇబ్బంది..
ఈ క్రమంలోని ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి యూనియన్ లో సభ్యత్వం లేని కార్మికులను కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎంతోమంది పనిచేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ యూనియన్ లో సభ్యత్వం కోసం లక్షల్లో డిమాండ్ చేస్తూ.. కొత్త వాళ్లకు అవకాశం కల్పించడం లేదని, ఇది ఎంతోమంది కార్మికుల పొట్టకొట్టడమే అవుతుందని TFCC పేర్కొంది.
యూనియన్ కారణంగా కొత్తవారికి అవకాశం లేకుండా పోతోంది – TFCC
వాస్తవానికి బయట రకరకాల ఉద్యోగాలతో పోల్చుకుంటే టాలీవుడ్ లో కొన్ని క్రాఫ్ట్ లకు మంచి జీతాలు ఉన్నాయి. అటు ప్రొడక్షన్ లో వారికి కూడా రకరకాల వేతనాలు బేటాలు, డబుల్ బేటాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఎంప్లాయిస్ తో కాదు యూనియన్లతో.. సభ్యత్వం ఉన్నవారే పనిచేయాలి అని రూల్ పెట్టుకున్నారు. అయితే అలా అని అందరికీ సభ్యత్వం అంత సులువుగా దొరకదు. యూనియన్ కార్డు కావాలి అంటే ఏ క్రాఫ్ట్ కైనా సరే లక్షల్లో వెచ్చించాలి.. అందుకే ఇప్పుడు జరుగుతున్న సమ్మెను పక్కనపెట్టి తమకు ఎవరు కావాలో వారిని రిక్రూట్ చేసుకుంటున్నారు నిర్మాణ సంస్థలు. అందులో భాగంగానే టాలీవుడ్ లో ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేశారు. స్వయంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఏ ఏ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేశారు.
ఉద్యోగాలకు పిలుపునిచ్చిన SVC సంస్థ..
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు తన SVC అఫీషియల్ ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. అఫీషియల్ వెబ్సైట్ ను కూడా ఓపెన్ చేసింది. ” తెలుగు చలనచిత్ర నిర్మాతల గిల్డ్ ఫిలిం సిబ్బంది కోసం పిలుపునిస్తోంది. నిర్మాతల గిల్డ్ రాబోయే తెలుగు చలనచిత్ర ప్రాజెక్టుల కోసం అనుభవజ్ఞులైన, ఆశావహులైన నిపుణుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కార్మికుల డిమాండ్స్ ఇవే..
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ నియమం ఉంది. అది చాలా ఏళ్ల నుంచి సంప్రదాయంగా కొనసాగుతోంది. అదేంటంటే.. ప్రతి మూడేళ్లకు ఒక సారి కార్మికుల వేతనాలను 30 శాతానికి పెంచాలి. కానీ, గత నాలుగు ఏళ్ల నుంచి అది జరగడం లేదు. దీని గురించి పలుమార్లు ఫిల్మ్ ఛాంబర్ మెట్లు ఎక్కారు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు. కానీ, నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ వేతనాల పెంపునకు అంగీకరించలేదు. దీంతో సంప్రదాయంగా కొనసాగతున్న నియమాన్ని పాటించాలని, తమకు 30 శాతం వేతనాలపు జరగాలని సినీ కార్మికులు పట్టుబట్టి కూర్చున్నారు. అందుకే సమ్మెకు దిగారు.
ఎవరైతే, తమకు 30 శాతం వేతనాలను పెంచడానికి ఒప్పుకుంటారో… వారి సినిమాలకే పని చేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం వేతనాలపు పెంపు ఉండదని, నిర్మాతలు అందరూ ఒకేతాటిపైకి వచ్చి అనౌన్స్ చేశారు. అంతే కాదు, యజమానికి ఎవరితో అయినా.. పని చేయించుకునే హక్కు ఉంటుంది. దాన్ని ప్రధానంగా తీసుకుని ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు. పని తక్కువ తెలిసిన వారైనా… పర్లేదు.. ట్రైనింగ్ ఇచ్చి మరీ పని చేసుకుంటామని నిర్మాతలు చూస్తున్నారు.
అవసరమైన క్రాఫ్ట్‌లు:
•డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ (ADలు, స్క్రిప్ట్ సూపర్‌వైజర్లు)
•సినిమాటోగ్రఫీ (DoPలు, కెమెరా అసిస్టెంట్లు, ఫోకస్ పుల్లర్లు)
•లైటింగ్ డిపార్ట్‌మెంట్ (గ్యాఫర్లు, లైట్ అసిస్టెంట్లు)
•ఆర్ట్ డిపార్ట్‌మెంట్ (ప్రొడక్షన్ డిజైనర్లు, ఆర్ట్ అసిస్టెంట్లు, సెట్ డ్రస్సర్లు)
•సౌండ్ డిపార్ట్‌మెంట్ (సింక్ సౌండ్ రికార్డిస్టులు, బూమ్ ఆపరేటర్లు)
•ఎడిటింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ (ఎడిటర్లు, DI ఆర్టిస్టులు, VFX సూపర్‌వైజర్లు, వాయిస్ ఆర్టిస్టులు)
•మేకప్ & కాస్ట్యూమ్ డిజైనర్లు & అసిస్టెంట్లు
•డాన్స్ కొరియోగ్రాఫర్లు మరియు డ్యాన్సర్లు
•స్టంట్‌లు మరియు SFX టెక్నీషియన్లు
•ప్రొడక్షన్ మేనేజర్లు & అసిస్టెంట్లు
ఇతర టెక్నికల్ & క్రియేటివ్ క్రూ అర్హత:
•స్కిల్ సర్టిఫికేషన్ లేదా ఫీచర్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు లేదా వాణిజ్య ప్రకటనలలో ముందస్తు అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యత
•టీమ్ పరిసరాలలో పని చేసే సామర్థ్యం ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అంటూ ఒక వెబ్సైట్ లింకును కూడా పొందుపరచడం జరిగింది.
కొత్తవారికి ఆహ్వానం పలుకుతూ ముందడుగు వేసిన మైత్రి మూవీ మేకర్స్..
దిల్ రాజు నిర్మాణ సంస్థతో పాటు అటు మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా కొత్తవారికి ఆహ్వానం పలుకుతూ ఒక వెబ్సైటు షేర్ చేశారు. ఇక ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి తమకు అనుభవం ఉన్న రంగాలలో అప్లై చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
ALSO READ:Raanjhanaa AI Climax: ధనుష్ కామెంట్స్ పై నిర్మాతలు సీరియస్… మాటమార్చాడు?
🎬 TELUGU FILM PRODUCERS GUILD
CALLING FOR FILM CREW – VARIOUS CRAFTS.The Telugu Film Producers Guild invites applications from experienced and aspiring professionals for upcoming Telugu film projects.
Required Crafts:
•Direction Department (ADs, Script Supervisors)…— Sri Venkateswara Creations (@SVC_official) August 4, 2025
The industry is evolving and this is a bold new step towards bringing in skilled workers into our industry.
Producers are ready for this refreshing change, giving opportunities to everyone without any union barriers.
Apply Now:
🔗 https://t.co/mWuRCwfvz9
📧 : info@atfpg.com pic.twitter.com/cQ7wGeuhtS— Mythri Movie Makers (@MythriOfficial) August 4, 2025