BigTV English

Yogi Babu : కామెడీ రాదు.. యోగిబాబు పరువు తీసిన బ్రహ్మీ..

Yogi Babu : కామెడీ రాదు.. యోగిబాబు పరువు తీసిన బ్రహ్మీ..

Yogi Babu : తమిళ కమెడియన్ యోగి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకోవడం తో పాటుగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఒకవైపు తమిళ్లో వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు తెలుగులో కూడా ఒక్కో సినిమా అవకాశాన్ని అందుకుంటూ బిజీగా మారాడు యోగి బాబు. తాజాగా ఈయన తెలుగులో గుర్రం పాపిరెడ్డి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడిన మాటలు హైలెట్గా మారాయి. యోగి బాబు గురించి బ్రహ్మీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ లాంచ్.. 

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం స్పీచ్ హైలెట్గా మారింది.


Also Read :ముసలోడే కానీ.. మహానుభావుడు సామి.. అస్సలు నమ్మలేరు..

యోగి బాబును అవమానించిన బ్రహ్మీ.. 

ఈ ఈవెంట్ లో బ్రహ్మనందం మాట్లాడుతూ.. గుర్రం పాపిరెడ్డి సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా కెమెరామెన్ టెక్నికల్ పరంగా సత్తా ఉన్నోడు అంటూ బ్రహ్మి పొగడ్తల వర్షం కురిపించాడు.. అలాగే యోగి బాబు గురించి మాట్లాడుతూ.. యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట యోగిబాబు. ఇలా కొత్త వాళ్ళతోకలిసి నటించడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది.. ప్రేక్షకులు ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారు అని బ్రహ్మానందం అన్నారు. ఏది ఏమైనా కూడా యోగిబాబుపై బ్రహ్మీ చేసిన కామెంట్లు కొందరికి తప్పుగా అనిపిస్తున్నాయి. కమెడియన్ కాదు అనడం తప్పు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై బ్రహ్మానందం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×